టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో పలు సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ కు సంబందించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే దర్శకుడు త్రివిక్రమ్ కు, అలాగే నిర్మాణ సంస్థ మైత్రికి శాశ్వత వైరం ఫిక్స్ అయిపోయినట్లేనా? మైత్రి అడ్వాన్స్ ను తిరిగి వెనక్కు ఇచ్చే విషయంలో నెలకొన్న అభిప్రాయబేధాలు ముదిరాయా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే కూడా అవి నిజమే అని అనిపిస్తోంది.ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో ఒక సినిమాను చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.
ఇటీవల సర్కారు వారి పాట సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.సాధారణంగా ఇలాంటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లకు ఆ సినిమాలో నటించిన హీరోతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు కూడా హాజరవుతూ ఉంటారు.
ఒకవేళ ఎవరిని పిలవకుండా కేవలం చిత్రయూనిట్ మాత్రమే ఆ ఫ్రీ రిలీజ్ వేడుకను చేసుకుంటే అది వేరు.కానీ అందరినీ పిలిస్తే అప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని కూడా పిలుస్తారు.కానీ అలా కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మాత్రం అలా పిలవలేదు అని తెలుస్తోంది.మహేష్ బాబుతో గతంలో సినిమాలు చేసిన దర్శకులు అందరికీ ఈ ఈవెంట్ కు పిలుపులు అందాయి.
కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాత్రం ఈవెంట్ నుంచి పిలుపు రాలేదు.త్వరలోనే మహేష్ బాబుతో సినిమా ఉంది అని తెలిసి కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ త్రివిక్రమ్ పిలవలేదు అంటే వైరం ముదిరినట్లే అని చెప్పవచ్చు.
మహేష్ పిలవమని చెప్పలేదు అంటే వైనం ఉందని అతను కూడా అర్థం చేసుకుని ఉండాలి.మొత్తం మీద ఓ టాప్ డైరక్టర్ కు, ఓ టాప్ నిర్మాణ సంస్థకు నడుమ తలుపులు పూర్తిగా మూసుకునిపోయినట్లే అని తెలుస్తోంది.
మరి ఈ వార్తలు అవాస్తవాలు అవుతాయా? త్రివిక్రమ్ శ్రీనివాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ మళ్లీ కలిసిపోతారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి.