కెప్టెన్ గా బాబా భాస్కర్.. బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో తాజాగా జరిగిన కిల్లర్ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది.ఈ టాస్క్ లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ ఒక్కొక్క కంటెస్టెంట్ ని కిల్ చేస్తూ ఆట ఆడిస్తున్నాడు.

 Baba Bhaskar Becomes House Captain Baba Bhaskar, Bigg Boss Non Stop, House Cap-TeluguStop.com

ఇక తాజాగా బిగ్ బాస్ నట్రాజ్ మాస్టర్ ని వాష్ రూమ్ మొత్తం చిందరవందరగా చేసి ఎవర్నో ఒకర్ని బ్లేమ్ చేయాలి అని చెప్పడంతో నటరాజ్ మాస్టర్ హమీద ని బ్లేమ్ చేయడానికి చూశాడు.ఆ తర్వాత హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్ ల మధ్య గొడవ పెట్టాలి అని నట్రాజ్ మాస్టర్ కు టాస్క్ ను అప్పగించాడు బిగ్ బాస్.

ఇక అప్పుడు నట్రాజ్ మాస్టర్ బిందు మాధవి దగ్గరికి వెళ్లి యాంకర్ శివ గురించి చెబుతూ బిందు మాధవి ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

ఇక బిందు మాధవి యాంకర్ శివ ఇద్దరు లైట్ తీసుకున్నారు.

ఇక కిల్లర్ టాస్క్ లో భాగంగా నట్రాజ్ మాస్టర్ అఖిల్,అరియానా, హమీద, అనిల్, శివ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మర్డర్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కిల్లర్ టాస్క్ ని కంప్లీట్ చేసి ఈవారం కెప్టెన్సీ పోటీదారుడు గా ఎంపికయ్యాడు.ఇక నట్రాజ్ మాస్టర్ చేతిలో కిల్ అయిన అయిదుగురు కంటెస్టెంట్ లు కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకోవాలని బిగ్ బాస్ కోరాడు.

మిగిలిన అషు రెడ్డి, మిత్ర, బిందు మాధవి, బాబా భాస్కర్ లు ప్రాణాలతో ఉన్న కారణంగా వాళ్ళని కెప్టెన్సీ పోటీదారులుగా నియమించారు బిగ్ బాస్.

Telugu Ashu Reddy, Baba Bhaskar, Bigg Boss, Bindu Madhavi, Mitra Sharma, Nataraj

ఆ తరువాత బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఇదే చివరి టాస్క్ అని చెప్పి, బాబా భాస్కర్, అషు, బిందు మాధవి, నట్రాజ్ మాస్టర్, మిత్ర శర్మ లకు బ్రిగ్స్ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.ఇక ఈ టాస్క్ లో భాగంగా చివరగా నటరాజ్ మాస్టర్,మిత్రా ల మధ్య టఫ్ ఫైట్ నడవగా, చివరి వరకు మిత్రశర్మ నట్రాజ్ మాస్టర్ కు గట్టిగానే కాంపిటీషన్ ఇచ్చింది.కానీ చివర్లో మి త్రశర్మ చతికెల పడిపోవడంతో నట్రాజ్ మాస్టర్ ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో విజేతగా నిలిచాడు.

అయితే కెప్టెన్సీ టాస్క్ లో విజేతగా నిలిచిన తరువాత, టాస్క్ పూర్తి అయ్యాక నట్రాజ్ మాస్టర్ గుక్కపట్టి ఏడ్చేశాడు.తన కూతురు కోసం ఏదైనా చేయాలని బిగ్ బాస్ కి వచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube