గోల్డెన్ టెంపుల్ లో మెగా కోడలు ప్రత్యేక పూజలు.. భర్తపై ప్రేమతో?

మెగా కోడలు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉపాసన ఒకవైపు కోడలిగా ఇంటి బాధ్యతలు చేయబడుతూనే, మరొక వైపు అపోలో హాస్పిటల్స్ ని మైంటైన్ చేస్తోంది.

 Upasana At The Golden Temple In Amritsar Golden Temple, Upasana , Ram Charan, To-TeluguStop.com

అంతే కాకుండా తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు మంచి మంచి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది.సోషల్ మీడియాలో ఉపాసనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కనిపించింది.అక్కడ ఉపాసన భర్త రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా పూజలు చేసింది.

ఆ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు.ఆయన ఆర్సి 15 షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే ప్రత్యేక హక్కు, అవకాశం నాకు లభించింది.రామ్ చరణ్, నేను మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాము.

వినయంతో అంగీకరిస్తున్నాను అంటూ గోల్డెన్ టెంపుల్ లోని ప్రత్యేక పూజ విషయాన్ని వెల్లడించింది ఉపాసన.ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు ముందు రామ్ చరణ్, తారక్, రాజమౌళి అలాగే ఆర్ఆర్ర్ టీమ్ అందరు గోల్డెన్ టెంపుల్ ని సందర్శించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌ తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా ఆర్సి 15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది.ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమాలో రామ్చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాకుండా మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందింస్తున్న విషయం తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అలాగె ఇందులో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకి కథను కార్తీక్ సుబ్బరాజ్ రాయగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నా విషయం విధితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube