ఆచార్య ఈవెంట్ ప్లేస్ చేంజ్.. కన్ఫ్యూజ్ అవుతున్న మెగా ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.

 Venue Changed For Acharya S Pre Release Event ,  acharya , Kajal Aggarwal , Kor-TeluguStop.com

కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.ఇందులో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించాడు.

చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.

దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు.

Telugu Acharya, Acharya Pre, Cm Jagan, Koratala Shiva, Kajal Aggarwal, Chiranjee

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.సినిమాలో యాక్షన్ ఏ లెవల్ లో ఉంటుందో మచ్చుకకు కొన్ని సీన్స్ చూపించాడు కొరటాల.

రామ్ చరణ్ తండ్రి చిరంజీవి తో కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ఇది.ట్రైలర్ తోనే అంత ఉత్సాహం ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు.

Telugu Acharya, Acharya Pre, Cm Jagan, Koratala Shiva, Kajal Aggarwal, Chiranjee

అందుకే ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఈ నెల 23న గ్రాండ్ గా జరగనుందని.ఆ ఈవెంట్ కు సీఎం జగన్ మైక్య అతిథిగా వస్తున్నారని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వేడుకను హైదరాబాద్ కు మార్చారని టాక్ వినిపిస్తుంది.దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పై గందరగోళం నెలకొంది.

దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube