తగ్గేదే లే అంటున్న షర్మిల... కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలతూటాలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీలు అంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు సాగుతున్నా మిగతా చిన్న చిన్న పార్టీలు కూడా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Sharmila Says Lay Down Harsh Comments On Kcr, Telangana Politics, Ysrtp Party-TeluguStop.com

అయితే ఇక ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఈ సందర్బంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్బంగా కేసీఆర్ పై షర్మిల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

రైతులను బావిలో తోసేసి ఇప్పుడు వాళ్ళను కాపాడమని మొత్తుకుంటున్నారని రైతుల బతుకులతో కెసీఆర్ చెలగాటమాడుతున్నారని షర్మిల మండిపడ్డారు.

అయితే కెసీఆర్ పట్ల అందరూ విమర్శల వర్షం గుప్పిస్తున్న తరుణంలో షర్మిల వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ నేతలు కానీ కెసీఆర్ కానీ స్పందించే అవకాశం లేకున్నా పరోక్షంగా కెసీఆర్ రచించే వ్యూహంలో షర్మిలను కూడా భాగస్వామ్యం చేసే పరిస్థితి ఉంది.

అయితే షర్మిల ఎంతగా విమర్శలు గుప్పించినా టీఆర్ఎస్ కీలక నేతల నుండి స్పందన వచ్చే పరిస్థితి లేదు.ఎందుకంటే తన రాజకీయ నిర్మాణంలో భాగంగా మాత్రమే షర్మిల అధికారంలో ఉన్న కెసీఆర్ ను విమర్శిస్తున్నదన్న విషయం సామాన్య ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిన నేపథ్యంలో ఎవరూ షర్మిల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం లేదని ఎవరూ కాదనలేని సత్యం.

మరి షర్మిలా తన ప్రజా ప్రస్థానం ద్వారా రాజకీయంగా బల పడుతుందా లేక ఏదైనా పార్టీ గెలుపుకు వాహకంగా మారుతుందా అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube