యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మెదక్ లో రైతు అవగాహన సదస్సు నిర్వహించిన బీజేపీ

మెదక్ జిల్లా: యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మెదక్ లో రైతు అవగాహన సదస్సు నిర్వహించిన బీజేపీ.సదస్సు కు హాజరైన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్ ,బాబు మోహన్ ,వాసురెడ్డి ,విజయ పాల్ రెడ్డి ,రాష్ట్ర నేతలు,జిల్లా ఇంచార్జీలు ,ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు,రైతులు.

 Bjp Farmer Awareness Seminar In Medak To Demand That State Government Buy Yasang-TeluguStop.com

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కామెంట్స్.సీఎం కేసీఆర్ కు నేను,నా కుటుంబం అనే అహం పెరిగింది.

రైతు లేకపోతే ప్రపంచమే లేదు.రైతు బిడ్డలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నాడు.

రైతు బాధ్యత వడ్లు పండించడం కొనడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.

నేను వడ్లు కొనను అని సీఎం కేసీఆర్ అంటున్నాడు.

వడ్లు కొని కేంద్రానికి బియ్యం ఇస్తా అని రాసిచ్చి వచ్చాడు సీఎం కేసీఆర్.ఏ రాష్ట్రం ఎంత బియ్యం ఇస్తారో అగ్రిమెంట్ చేశారు.

గత వానాకాలం లో పండించిన దాన్యంతో ఎఫ్సిఐ కి ఎన్ని బియ్యం ఇచ్చారో స్పష్టం చేయాలి.హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి కేసీఆర్ మైండ్ బ్లాక్ అయింది.

హుజురాబాద్ లోనే రైతులు,మహిళల పై కక్ష కట్టారు.రైతు పండించిన ప్రతి గింజను కొంటామని కేంద్రం చెబుతుంది.

పికే సలహాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు.సీఎం కేసీఆర్ ఇక నీ ఆటలు సాగవు.రైతులకు కేంద్రమిచ్చే సబ్సిడీ లన్నీ ఎత్తేశావు.రైతులకు సక్రమంగా కరెంట్ ఇవ్వటం లేదు.

కరెంట్ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.నీళ్లు ,నిధులు ,నియామకాల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది.

పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పి ఇంతవరకు చేయలేదు.ఇక కేసీఆర్ పని అయిపోయింది.

ఇన్ని ఏండ్లలో రూలింగ్ ప్రభుత్వాలు ఆందోళనలు చేశాయా.రాబోయే రోజుల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

భారత దేశాన్ని ఆదుకునే పార్టీ బీజేపీ.పీకే కూడా బీజేపీ ఏజెంటే.

Telugu Babu Mohan, Jithender Reddy, Medak, Nadishwar Goud, Vijayajaipal, Yasangi

మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కామెంట్స్.జితేందర్ రెడ్డి ఎక్కడ కాలు పెడితే అక్కడ బీజేపీ విజయం పక్కా.ఎక్కడ ఎన్నికలు జరిగిన అక్కడ జితేందర్ రెడ్డి ఉండాల్సిందే.హుజురాబాద్ లో అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసిన టిఆర్ఎస్ ఓడిపోయింది.ప్రతి గింజ కొంటా అని అసెంబ్లీ సాక్షి గా చెప్పిన సీఎం రైతులను మోసం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్ముకుంటున్నారు.

టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది.అధికార టిఆర్ఎస్ కు 20 సీట్లు కూడా రావు.

కాంగ్రెస్ పార్టీ లో గొడవలు తప్ప ప్రజల పక్షాన ప్రశ్నించడం లేదు.ప్రజా సమస్యల దృష్టి మళ్లించడానికే టిఆర్ఎస్ వడ్ల పంచాయితీ చేస్తుంది.

ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు బీజేపీ ఉద్యమిస్తోంది.బీజేపీ పై అనవసరంగా టిఆర్ఎస్ నేతలు అబండాలు మోపుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల వడ్లు కొనేదాక ప్రతి బీజేపీ కార్యకర్త పోరాటం చేయాలి.ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది లో ఎనిమిది నియోజకవర్గాలు గెలిచేలా క్యాడర్ పనిచేయాలి.

Telugu Babu Mohan, Jithender Reddy, Medak, Nadishwar Goud, Vijayajaipal, Yasangi

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావ్ దేశ్ పాండే కామెంట్స్…వడ్ల పంచాయితీ ఏ రాష్ట్రంలో లేనిది తేలంగాణ లో ఎందుకుంది.టిఆర్ఎస్ ఉద్దేశ్య పూర్వకంగానే బీజేపీ ని బద్నాం చేస్తుంది.తెలంగాణ లో బీజేపీ రోజురోజుకూ పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి.రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.టిఆర్ఎస్ కుట్రలను రైతులకు వివరించాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలది.

మాజీ మంత్రి బాబు మోహన్ కామెంట్స్.ప్రతి గింజ కొంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో చెప్పారు నేడు విస్మరిస్తున్నారు.సీఎం కేసీఆర్ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు.అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసే బాధ్యత ప్రభుత్వానిది.

వానకాలంలో సమయానికి వడ్లు కొనకుంటే రైతులు వడ్ల కుప్పలపై కూలి చనిపోయారు.వడ్లు కొనం అని ప్రధాని మోడీ ఎక్కడ చెప్పలేదు.

వడ్లు కొని ఎఫ్సిఐ కి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. సీఎం కేసీఆర్ చేతగాని మాటలు మాట్లాడి రైతులను ఇబ్బంది పెడుతున్నావ్.

రైతులకు వడ్లు వేయొద్దని తన ఫామ్ హౌజ్ లో వరి వేసుకున్నాడు.వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ కే ఉరేయాలి.మీకు పాలన చేతకాక పోతే తప్పుకోండి.24 గంటల్లో వడ్లు కొనిపిస్తాం.అబద్ధాల కోరు సీఎం కేసీఆర్ మాటలు వినొద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube