అంతరిక్షంలోకి వెళ్లాల‌నుకుంటే సామాన్యునికి ఎంత ఖ‌ర్చ‌వుతుందంటే..

పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్ల‌డం అనే అంశంపై అంత‌టా చర్చ జరుగుతోంది.ఇటీవల కొంతమంది అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.

 Can You Go In Space And What Will Be Expenses For That ,space , Expenses , Richa-TeluguStop.com

కొద్ది రోజులుగా అంతరిక్షయానం చేయాలనే ఆలోచన ఊపందుకుంటోంది.అంత‌రిక్షంలోకి సామాన్యుడు వెళ్లాల‌నుకుంటే దానికి ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ వంటి బిలియనీర్లు సామాన్యుల‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో బిజీగా ఉన్నారు.రిచర్డ్ బ్రాన్సన్ కంపెనీ ఇప్పుడు ఇందుకోసం బుకింగ్స్‌ ప్రారంభించింది.

ఇందుకు అయ్యే ఖ‌ర్చు గురించి ప్ర‌స్తావించాల్సివ‌స్తే.అంతరిక్షంలోకి వెళ్లడానికి బుకింగ్ కోసం 4.5 లక్షల డాల‌ర్లు అవసరం అంటే దాదాపు రూ. 3 కోట్ల 43 లక్షలు.దాదాపు 1.5 లక్షల డాలర్లు చెల్లించి బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈ టిక్కెట్లను పొందేందుకు అర్హులు.1000 మంది ఇందుకోసం బుక్ చేసుకున్న తర్వాత ఈ యాత్ర ప్రారంభంకానుంది.

ఇప్పటివరకు ఎన్నో విమానాలను అంతరిక్షంలోకి పంపారు.

స్పేస్ ఎక్స్ తన విమానాన్ని ఆకాశంలోకి పంపినప్పుడు, స‌ద‌రు సంస్థవారు 3 రోజుల పాటు న‌లుగురిని అంత‌రిక్షంలోకి పంపారు.అయితే ఇప్పటి వరకు ఈ కంపెనీలు అంతరిక్ష ప్ర‌యాణానికి ఎంత డబ్బు వ‌సూలు చేశాయో ప్రకటించలేదు.

కాగా అంతరిక్షంలోకి వెళ్లే ముందు ఎవ‌రైనా స‌రే అనేక పరీక్షలు చేయించుకోవాలి.సుదీర్ఘ శిక్షణను పొందవలసి ఉంటుంది.ఆ తర్వాత మాత్రమే వారిని అంతరిక్షంలోకి పంపుతారు.ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం అంతరిక్షంలోకి వెళ్లడానికి సుమారు 55 మిలియన్లు ఖర్చవుతుంది.మీరు దీన్ని భారతీయ కరెన్సీలో మార్చినట్లయితే, అది రూ.401,65,48,250 అంటే 401 కోట్ల‌, 65 లక్షల 48 వేల 250 రూపాయ‌లు.మీకు ఎప్పుడైనా అంతరిక్షంలోకి వెళ్లాల‌నుకుంటే ఇంత మొత్తాన్ని మీ ద‌గ్గ‌రుంచుకోవాల‌న్న మాట‌!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube