ఆ రాష్ట్రాల సీఎంలు జగన్ కు సాయం చేస్తారా.. జగన్ షణ్ముక వ్యూహాన్ని ఎలా చేధిస్తారు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడంతా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికలకు పొలిటికల్ పార్టీలు అన్నీ సిద్ధమవుతున్నాయి.

 Will The Cms Of Those States Help Jagan How Will Jagan Defeat Shanmuka S Strate-TeluguStop.com

ఎలాగైనా సరే అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలని ప్లాన్ వేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆవిర్భావ సభ జరిపిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆ సభలో మాట్లాడుతూ.

షణ్ముక వ్యూహం అనుసరించి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని ప్రకటించారు.మరో వైపు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ కూడా ఎలాగైనా సరే వైసీపీని ఓడించి అధికారం తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది.

ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీ ఏం చేస్తుందా? ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎలా ఎదుర్కొంటుందా ? అన్న ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి.

Telugu Jagan, Janasena, Odisha, Pawan Kalyan, Tamil Nadu, Tdp, Telangana-Telugu

పవన్ కల్యాణ్ ప్రకటించిన షణ్ముక వ్యూహంలో ప్రధానంగా వైసీపీ వ్యతిరేఖ ఓటు చీల్చకుండా ఉంచడం, పక్క పార్టీలను కలుపుకుని ఎన్నికలకు పోవడం మెయిన్ గా ఉన్నాయి.కానీ ఇటువంటి తరుణంలో ఏపీలో అధికారంలో లేని పార్టీలు అన్నీ ఏకతాటి మీదికి వస్తాయా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదే తరుణంలో అధికారంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల సీఎంల మద్దతు తప్పనిసరిగా తీసుకుంటారనే చర్చ జోరుగా నడుస్తోంది.

తమిళనాడు, ఒడిషా, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్ కు మంచి మిత్రులుగా ఉన్నారు.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వీరి సాయం తప్పకుండా తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది.ఇంకా అదే కాక వీరంతా కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతో ఎక్కువగా పడని నేతలు.కావున ఈ నేతలు తప్పకుండా జగన్ కు సాయం చేస్తారని రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా చెబుతున్నారు.

ఇక ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube