తెలంగాణ రాష్ట్రంలో పల్లెవెలుగు , సిటీ ఆర్డినరీ , మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డీలక్స్ ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలు పెంచి పేద,మధ్యతరగతి ప్రజలపై భారాన్ని వేయడాన్ని సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు తీవ్రంగా ఖండించారు.తక్షణమే పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెంచిన ఆర్టీసీ చార్జీలను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు .తెలంగాణ ప్రభుత్వం ఆర్డినరీ బస్సుల్లో 10 కిలోమీటర్ల నుండి , మెట్రో ఎక్స్ ప్రెస్ 6 కిలోమీటర్ల నుండి , మెట్రో డీలక్స్ 4 కిలోమీటర్ల నుండి 5 రూపాయల చొప్పున టిక్కెట్ ధరలు పెంచి ప్రజలపై భారం వేసిందని , పల్లెవెలుగు బస్సుల్లో 13 రూపాయలున్న టికెట్ ధరను 15 రూపాయలకు , రు .17 మరియు 18 ఉన్న టిక్కెట్ ధరను 20 రూపాయలకు పెంచిందన్నారు .దీనికి తోడు టోల్రజా ఛార్జీలను కూడా ప్రజల నుండే అదనంగా వసూలు చేస్తున్నారని , ఇది ప్రజా రవాణ అయిన ఆర్టీసీపై ఆధారపడి ఉన్న పేద , మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమే అవుతుందన్నారు .ఆర్టీసీని నష్టాల బాటనుండి గట్టెక్కించడానికి బడ్జెట్లో సరిపోయినన్ని నిధులు కేటాయించి సంస్థను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం , నేడు ఆర్టీసీ ఆస్తులను ప్రయివేటువారికి కట్టబెట్టి , ప్రయాణ టిక్కెట్టు రేట్లు పెంచి పూడ్చుకోవాలని చూస్తున్నదని , దీంతో ఆర్టీసి తన ఆస్తులను కోల్పోవడమే కాకుండా , ప్రజలపై పెనుభారం పడుతున్నదన్నారు .ఆర్టీసీ నష్టాలను ప్రజల మీద రుద్దుకుండా కొన్ని యితర రాష్ట్రాలలో మాదిరిగా తెలంగాణ ముత్వమే నష్టాలు భరించి ప్రజలకు రాయితీలను కూడా కల్పించాలన్నారు .ఆ విధంగా చర్యలు తీసుకొని , తక్షణమే ఆర్టీసీకి 2 శాతం నిధులు కేటాయించి ఆర్టీసీని ఆదుకోవాలని , పెంచిన టిక్కెట్ ధరలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
.