తానా ప్రపంచ సాహిత్య వేదిక కథల పోటీ...ఆఖరు తేదీ ఎప్పుడంటే...!!

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) గురించి తెలియని తెలుగు వారు ఉండరు.అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు భాష కోసం, తెలుగు వారి అభివృద్ధి, వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ.

 Tana Ugadi Story Writing Competitions,story Writing Competitions,tana,ugadi ,tel-TeluguStop.com

ప్రపంచంలో అతి పెద్ద తెలుగు సంఘంగా తానా ఎంతో ప్రఖ్యాతి సాధించింది.అమెరికాలో తెలుగు కుటుంబాల పిల్లలకు తెలుగును నేర్పడం మొదలు తెలుగు పండుగలు, తెలుగు భాషపై పట్టు పెంచేందుకు కథలు, రచనల పోటీలు, నాటకాలు, పద్యాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తోంది.

తాజాగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కధల పోటీకి ఆహ్వానం పలుకుతోంది.

ఈ కథలు పోటీకోసం భారత దేశపు రక్షణ, రైతులు, పల్లెలు, భారత దేశ సమగ్రత, సామాజిక భాద్యత, చదువు ఇలా ఏ సామాజిక అంశాన్నయినా ఎంచుకోవచ్చు.

అయితే కథలు పంపే వారికి కొన్ని షరతులు విధించింది తానా.రచయిత పంపే కథలు స్వీయంగా రచించినవి అయి ఉండాలి.అవి ఎక్కడా ప్రచురించి ఉండకూడదు.ఈ కథలు తాము రచించినవే అనే హామీ పత్రంకూడా రచనలతో జత చేర్చాలి.

ఇక రచయిత పూర్తి చిరునామా, వాట్సప్ నెంబర్ కూడా పంపాలి.

కథలను పంపే ముందు కథ యూనిక్ కోడ్ లో కానీ లేదంటే చేతి వ్రాతతో కానీ, ఉండాలి అది కూడా A4 పేపర్ సైజ్ లో Pdf , jpeg , word ఫార్మాట్ లలో ఉండాలి.

వీటిని +91 9121081595 నెంబర్ కి పంపవచ్చు.కథలు అందాల్సిన చివరి తేదీ ఏప్రియల్ 2 -2022.తానాకు ఈ కథలు మొత్తం అందిన తరువాత 22,23,24 తేదీలలో జరిగే కథ వికాసం అంతర్జాల కార్యక్రమంలో రచయితలూ స్వయంగా పాల్గొని కథను చదివి వినిపించవచ్చు.మూడు రోజుల తరువాత ఉత్తమ కథలను నిర్ణయిస్తారు.ప్రతీ ఉత్తమ కథకు రూ.5 వేలు తో పాటు ప్రశంసాపత్రం అందించడం జరుగుతుంది.ఇలా 20 ఉత్తమ కథలను ఎంపిక చేయనున్నట్లుగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు వెల్లడించారు.మరిన్ని వివరాలకోసం +91 9121081595 నెంబర్ ను సంప్రదించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube