రాయచోటి జిల్లా కేంద్రం కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు .కడప జిల్లా రాయచోటి పట్టణంలోని తన కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతు జిల్లా నోటిఫికేసన్ కు సంబనిదించి అభ్యర్ధనలకు రేపు చివరి తేది అని ఇప్పటికే రాయచోటి ప్రాంతం జిల్లా కేంద్రంగా ఎందుకు ప్రకటించాలి అని అంశం పై ప్లానింగ్ కమిటి అధికారి విజయ్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ కు స్థానిక జిల్లా సమితి కమిటి సబ్యులు ,ప్రజల సహకారంతో నివేదిక ఇవ్వడం జరిగింది.
ఏప్రిల్ 2 తర్వాత పట్టణానికి 103 ప్రభుత్వ కార్యాలయాలు రాబోతున్నాయన్నారు.
ఇప్పటికే సుమారు 1500 మంది వివిధ శాఖల ఉద్యోగులు విధుల నిర్వహణకు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుందన్నారరాయచోటిని జిల్లా కేంద్రం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా ప్రాంత ప్రజల తరపున శతకోటి వందనాలు తెలియజేశారు.
రియల్ వ్యాపారులు ప్లాట్లలో రాళ్లు పూడుచుకుంటూ వెళ్లడం కంటే భవన నిర్మాణాలపై దృష్టి పెడితే రాయచోటి పట్టణం విస్తరించి నగరంగా ఏర్పాటు అవ్వడంతో పాటు అన్ని విదాల అభివృద్ధి చెందుతుందన్నారు.జిల్లా కేంద్రం పేరుచెప్పి అక్రమాలు, అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టం, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
జిల్లా కేంద్రం ఆరు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో నివాసయోగ్యంగా ఉందన్నారు.
స్థానిక, స్థానికేతర బేధాలు తీసుకొస్తే చర్యలు తప్పవన్నారు.
ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం, మట్టి తవ్వకాలు చేపట్టే వారిపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నిఘా మరింత పెంచాలన్నారు.రాయచోటి అభివృద్ధికి ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నాన్నారు.
పట్టణానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వారికి గట్టిగా బుద్ధి చెబుతామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు.