తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మా అధ్యక్షుడిగా పని చేసి మంచి గుర్తింపు పొందారు.
ఇలా ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి పై కేసు నమోదు కావడంతో నరేష్ ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే నరేష్ భార్య రమ్య తన పేరు చెప్పుకొని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తోందని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు అయ్యింది.
నటుడు నరేష్ గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఏపీ మాజీమంత్రి రఘువీరా రెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య రఘుపతిని మూడవ వివాహం చేసుకున్నారు.వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నారు.
అయితే వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు రావడం చేత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.ఈ క్రమంలోనే గతంలో రమ్య నరేష్ కుటుంబ సభ్యులతో, నరేష్ తో దిగిన ఫోటోలను అడ్డుపెట్టుకొని పెద్దఎత్తున ఇతర మహిళల నుంచి అధిక వడ్డీకి డబ్బులు వసూలు చేయడం, రిజిస్ట్రేషన్ పేర్లతో కోట్లలో మోసానికి తెరలేపడంతో ఈమెపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నటుడు నరేష్ స్పందిస్తూ.గత కొన్ని సంవత్సరాల క్రితమే రమ్యతో ఏ విధమైన ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేశారు.ఆమె ఫోటోలను అడ్డుపెట్టుకొని ఇతరుల నుంచి వసూలు చేసిన డబ్బుకు, ఆమె చేసిన అప్పులకు నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని నరేష్ స్పష్టం చేశారు.ప్రస్తుతం రమ్య గురించి నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా….
ప్రస్తుతం రమ్య నరేష్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.