ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో కోర్టు సీన్స్ ట్రెండ్ నడుస్తుంది.అవును ఇది నిజమే… ఎందుకంటే గత కొన్ని సినిమాలు చూసుకుంటే ప్రతీ సినిమాలో కూడా తప్పనిసరిగా కోర్టు సీన్ ఉంటుంది.
ఇక సినిమాల్లో హీరో హీరోయిన్లు కోర్టు సన్నివేశాలలో నటిస్తున్నారు.పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో ప్రజల పక్షాన నిలబడుతూ న్యాయం కోసం పోరాడే ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించాడు పవన్ కళ్యాణ్.
చందు అనే లాయర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జై భీమ్ సినిమాలో ప్రజలకు న్యాయం చేసిన లాయర్ గా కనిపించాడు తమిళ స్టార్ హీరో సూర్య.ఇక అంతకుముందు నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో కనిపించింది.
ఇక నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ సినిమాలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సైతం లాయర్ పాత్రలో నటించి అందరిని ఆకర్షించింది.ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది స్టార్లు లాయర్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇక ఈ ఏడాది కూడా మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు లాయర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధమైపోయారు అని తెలుస్తోంది.ఇప్పటివరకు తన అందం అభినయంతో ఆకట్టుకున్న మిల్కీబ్యూటీ తమన్నా, హస్కీ బ్యూటీ రాశికన్నా, క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్ లాయర్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారట.
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రాశి ఖన్నా.ఇక ఈ సినిమాలో వకీలుగా కనిపించబోతుందట ఈ హాట్ బ్యూటీ.ఈ సినిమా మే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోళాశంకర్ లో అవకాశాన్ని దక్కించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇక వేదాళం సినిమాలో కూడా నటిస్తోంది.
ఈ రెండు సినిమాల్లో కూడా లాయర్ గాని కనిపించబోతుందట ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ సినిమాలు ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇకపోతే కేరళ కుట్టి కీర్తి సురేష్ సైతం మలయాళ చిత్రం వాసిలో లాయర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యే అవకాశం ఉంది.