లవ్ అనాగానే ప్రేమికుల జంట పేరు వినపడుతుంది.ఇద్దరిలోనూ ప్రేమ ఉంటేనే సఫలమవుతారు.
వన్ సైడ్ లవ్ అయితే కలసిపోవడం ఆశగానే మిగులుతుంది.ఇది రెండు హృదయాలకు చెందిన విషయం.
కానీ, ఇదే తీరు రాజకీయాల్లోనూ నెలకొంటోంది.రెండు పార్టీలు జతకట్టే విషయంలో వన్‌సైడ్ కాకుండా టూ సైడ్ ఆలోచించాలి.
అప్పుడే విజయఢంకా మోగిస్తారు.ఎందుకంటే పవర్ చుట్టే రాజకీయం తిరుగుతుంది.
దీనినే తలంచిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాజాగా లవ్ జపం చేస్తున్నారు.ఇందుకు జనసేన పార్టీతో పొత్తుపై బాబు చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బాబు పలు వ్యాఖ్యలు చేశారు.ఇవి ప్రస్తుతం చర్చణీయంశంగా మారాయి.
అయితే ఏపీలో నెలకొన్నరాజకీయాలను చూస్తే జగన్‌ను ఎదుర్కునే శక్తి విపక్షాలకు లేనట్టు కనిపిస్తోంది.జగన్‌ను నిలువరించాలంటే ఒక్కరితో అయ్యే పనిలో లేదని భావించి కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు రాబట్టొచ్చని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బాబు కుప్పం పర్యటనలో లవ్ అనే పదాన్ని ప్రయోగించారు.పొత్తు అనేది లవ్ అంటూ చమత్కరించారు.అదీ జనసేన పార్టీపై కావడంతో ఆసక్తికర చర్చ సాగుతోంది.టీడీపీ వన్‌సైడ్ లవ్ గురించి చెప్పుకురావడం… జనసేనకు లవ్ సంకేతాలు పంపడం లాంటి చూస్తుంటే పొత్తు పెట్టుకునేటు్ట కనిపిస్తోంది.
అయితే జనసేనాని పవన్ అండ్ కో మాత్రం తొలుత గళం విప్పలేదు.అదొక మైండ్ గేమ్‌గా అనుకుని స్పందించలేదని తెలిసింది.
తాజాగా జనసేనలో పవన్ తర్వాత ప్రాధాన్యం ఉ్న నేత నాదేండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.టీడీపీతో పొత్తు అనే రాజకీయపరంగా తీసుకోవాల్సిన అంశం అని, దానిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
అంటే పొత్తులపై తమకున్నలవ్ గురించి చెప్పకనే చెబుతున్నట్టు కనిపిస్తోంది.అంటే జనసేన కూడా వన్‌సైడ్ లవ్‌ను గుర్తించిందనే చెప్పొచ్చు.
నాదేండ్ల వ్యాఖ్యలతో టీడీపీలో కొంత ఆనందం వ్యక్తమవుతోందని తెలుస్తోంది.
ఏది ఏమైనా 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ ఎదుర్కొని పవర్ దక్కించుకోవడం ఒక్క టీడీపీతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.అందుకే జనసేనను కలుపుకోవాలని ఇటు తెలుగు తమ్ముళ్లు, అటు పవన్ తమ్ముళ్లు కూడా చెబుతున్నారు.ఈ కాంబినేషన్ కుదరకుంటే మళ్లీ 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని తెలుస్తోంది.
అందుకే వన్‌సైడ్ లవ్ వీడీ సెకండ్ లవ్ జపం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.మరి ఈ టూ సైడ్ లవ్ ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.