వలస కార్మికులకు ఉపాది కల్పిస్తున్న ప్రముఖ దేశాలుగా గల్ఫ్ దేశాలుఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు దుబాయ్ వంటి దేశాలకు పొట్ట కూటి కోసం వలసలు వెళ్తూ ఆర్ధికంగా స్థిరపడుతూ ఉంటారు.
అయితే తమ దేశంలో పని చేసే వారికి ఆయా దేశాలు ఎలాంటి జీత భత్యాలుఇస్తాయో అదేవిధంగా కటినమైన నిభందనలు కూడా విదిస్తుంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో గల్ఫ్ దేశాలు చాలా కటినమైన వైఖరిని పాటిస్తాయి.
అంతెందుకు వలస వాసులు ఎవరైనా సరే తాము విధించిన నిభందనలకు విరుద్దంగా వ్యవహరిస్తే వారిని దేశం నుంచీ శాశ్వతంగా బహిష్కరిస్తాయి.అయితే
దుబాయ్ తాజాగా తమ దేశంలో ఉంటున్న ప్రవాసులు, స్థానికులకు హెచ్చరిక జారీ చేసింది.
దేశంలో ఎవరైనా సరే మరొకరిని అడుక్కుంటూ కనిపిస్తే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోబడుతాయని ప్రకటించింది.ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియాలో కీలక ప్రకటన జారీ చేసింది.దేశంలో అడుక్కుంటూ ఎవరైనా కనిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని, అలాంటి వారికి 3 నెలల జైలు శిక్ష తో పాటు , రూ.1 లక్ష జరిమానా కూడా విధిస్తామని వెల్లడించింది.అడుక్కోవడం ఏదైనా రూపంలో లేదంటే భౌతికంగా జరిగితే సుమారు 5 వేల దిర్హమ్స్ కు తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని ప్రకటించింది అంతేకాదు ఎలాంటి పరిస్థితులలో శిక్షలు విధిస్తారో కూడా వివరించింది.
అడుక్కుంటున్న వ్యక్తి ఆరోగ్యంగా ఉండి, తాను బ్రతికేందుకు స్పష్టమైన పరిస్తితులు ఉన్నా సరే అడుక్కుంటున్న సందర్భంలో సదరు వ్యక్తిని అరెస్ట్ చేస్తారు.అలాగే అడుక్కునే వ్యక్తి వైకల్యం ఉన్నట్టుగా నటించినా, సేవ చేస్తున్నట్లు నటిస్తూ డబ్బులు తీసుకుంటున్నా, డబ్బులు సంపాదించేందుకు ఎలాంటి మోస పూరిత మార్గాలను ఎంచుకుంటున్నా సరే అతడిని అరెస్ట్ చేసి జరిమానా విధిస్తామని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.