వాలెంటైన్స్ డే కానుకగా విడుదలకానున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం నుండి పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య..

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`.కిషోర్ తిరుమల ద‌ర్శ‌కుడు.

 Sharwanand Adavallu Meeku Joharlu Movie Melody Aadhya Releasing On Valentines Da-TeluguStop.com

టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.కేవలం టైటిల్ సాంగ్‌, టీజ‌ర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌.

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మ‌రింత‌ మంచి రెస్పాన్స్ వస్తోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.

రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించిన టైటిల్ సాంగ్‌ను ఈ మధ్యే విడుదల చేయగా ఆ పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

రేపు వాలెంటైన్స్ డే కానుక గా దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య పాటను విడుదల చేయనున్నారు.

కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం.సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

నటీనటులు :

శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సాంకేతిక బృందం

దర్శకత్వం: తిరుమల కిషోర్ నిర్మాత : సుధాకర్ చెరుకూరి బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్ కొరియోగ్రఫర్: దినేష్ పీఆర్వో: వంశీ-శేఖర్

.

Sharwanand Adavallu Meeku Joharlu Movie Melody Aadhya Releasing On Valentines Day Details, Sharwanand ,adavallu Meeku Joharlu Movie, Melody Aadhya Song, Valentines Day, Heroine Rashmika Mandanna, Director Kishore Tirumala - Telugu Adavallumeeku, Aadhya, Sharwanand, Day

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube