కోలీవుడ్ స్టార్ హీరోతో జోడీ కట్టనున్న రష్మిక... శ్రీవల్లి స్పీడ్ మామూలుగా లేదుగా!

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

 Rashmika Is With Kollywood Star Hero Srivalli Speed ​​is Next Level, Rashmik-TeluguStop.com

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఈ క్రమంలోనే పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక త్వరలోనే ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక కోలీవుడ్ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం తమిళ హీరో విజయ్ దళపతి బీస్ట్ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఈ చిత్రం తర్వాత విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించనున్నారు.విజయ్ కోసం వంశీ అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో విజయ్ సరసన నటించడం కోసం వంశీ పైడిపల్లి నేషనల్ క్రష్ రష్మికను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక ఈ సినిమాకి సరిగ్గా సరిపోతుందని దర్శకుడు వంశీ పైడిపల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరో విజయ్ సరసన నటించే అవకాశాన్ని రష్మిక దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా తెలియజేయనున్నారు.తాజాగా పాన్ ఇండియా చిత్రం పుష్ప ద్వారా మంచి విజయాన్ని అందుకున్న రష్మిక వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా మారిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube