స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలతో, రియాలిటీ షోలతో వరుస విజయాలను అందుకుంటున్నారు.అఖండ సక్సెస్ బాలయ్య కెరీర్ కు ప్లస్ కావడంతో పాటు బాలయ్య ను పవర్ ఫుల్ గా చూపించడంతో బోయపాటి శ్రీనుకు సైతం ప్రశంసలు దక్కాయి.
బాలయ్య కాకుండా అఖండ సినిమాలో ఎవరు నటించినా ఆ సినిమా ఈ స్థాయి విజయాన్ని మాత్రం అందుకునేది అయితే కాదని స్వయంగా ఇతర హీరోల అభిమానులే చెబుతున్నారు.
అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించిన నాగ మహేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఖైదీ నంబర్ 150 సినిమాకు ముందే శ్రీవల్లి సినిమా కొరకు పని చేయాల్సి వచ్చిందని నాగ మహేష్ తెలిపారు.శ్రీవల్లి సినిమాకు తాను ఘోస్ట్ రైటర్ అని నాగ మహేష్ వెల్లడించగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ తర్వాత నటుడిగా కెరీర్ ను కొనసాగించానని నాగ మహేష్ తెలిపారు.
డేట్స్ అడ్జస్ట్ మెంట్ విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని నాగ మహేష్ వెల్లడించారు.
కొన్నిసార్లు కాంబినేషన్ సీన్లు ఉంటాయని అందువల్ల సినిమాలను వదులుకోక తప్పదని నాగ మహేష్ అన్నారు.ఉప్పెనలో పాత్ర బాగుందని త్రివిక్రమ్ ప్రశంసించారని నాగ మహేష్ వెల్లడించారు.త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ఫ్యాష్ బ్యాక్ లో ఛాన్స్ ఇచ్చారని కానీ డేట్స్ సమస్య వల్ల సినిమాను వదులుకున్నానని ఆయన తెలిపారు.
బాలయ్య చాలా సరదా మనిషి అని ఓవరాక్షన్ చేస్తే ఆ క్షణం ఆయన కట్ అయిపోతారని నాగ మహేష్ అన్నారు.ఆయనను మెప్పించాలని లేదా బిస్కెట్లు వేయాలని ప్రయత్నిస్నే మాత్రం వెంటనే ఫసక్ అని నాగ మహేష్ చెప్పుకొచ్చారు.స్టార్ అయినా ఆయన అందరితో బాగా మాట్లాడతారని నాగ మహేష్ అన్నారు.