తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి అంటే కమర్షియల్ బాక్సాఫీస్ కింగ్.
బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన గ్రేట్ స్టార్ చిరంజీవి.ఇక చిరంజీవి సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ప్రేక్షకులు భారీ స్థాయిలో థియేటర్ల వద్ద క్యూ కట్టేవారు.
ఇక చిరంజీవి కూడా అందుకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ అందుకునే వాడు.ఇకపోతే చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు – అతిలోక సుందరి ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమా అప్పట్లోనే మంచి ఘనవిజయాన్ని సాధించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సంచలనం సృష్టించింది.
ఈ సినిమాకు దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అప్పట్లోనే దాదాపుగా తొమ్మిది కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.9 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 15 కోట్ల వరకు వసూలు సాధించింది.అంతే కాకుండా కొన్ని థియేటర్లలో ఈ సినిమా దాదాపుగా 200 రోజులు కూడా ఆడింది.
చిరంజీవి హీరోయిజం, అందుకు తగ్గట్టుగా శ్రీదేవి అందం, ఇళయరాజా మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టాయి.అయితే శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్ సెట్ చేయడానికి రాఘవేంద్రరావు చాలా కసరత్తులు చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే అప్పటికే బాలీవుడ్ లో శ్రీదేవి టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.
ఇక అలాంటిది తెలుగులో ఒక పెద్ద స్టార్ హీరో సరసన నటించడానికి మొదట శ్రీదేవి అంగీకరించలేదు.కాని దర్శకుడు రాఘవేంద్రరావు అతి కష్టం మీద ఒప్పించారు.అయితే ఈ సినిమాకు చిరంజీవితో పాటు, శ్రీదేవి కూడా సమానంగా పారితోషికం అందుకున్నట్లు నిర్మాత అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమాకు చిరంజీవికి 35 లక్షల పారితోషికం ఇవ్వగా, శ్రీదేవి కూడా 25 లక్షలు క్యాష్ రూపేనా అందజేసి మిగతా అమౌంట్ కూడా వివిధ రూపాల్లో అందించినట్లు తెలిపారు.అయితే శ్రీదేవి కి చిరంజీవి తో సమానంగా పారితోషికం ఇవ్వడం వెనుక కారణం ఆమెకు ఉన్న క్రేజ్ అని తెలుస్తోంది.
శ్రీదేవి అప్పట్లో స్టార్ హీరోలకు సమానంగా పారితోషకం తీసుకునేవారట.ఇక రెమ్యూనరేషన్ విషయంలో అతిలోక సుందరి శ్రీదేవి ఏ మాత్రం తగ్గేవారు కాదని మీడియాలో చాలా సార్లు ప్రచారాలు జరిగాయి.
ఈ సినిమా తర్వాత చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి.