అత్యంత ఖ‌రీదైన కారును కొన్న అంబానీ.. రేటు తెలిస్తే..

భారత‌దేశంలోని అత్యంత సంప‌న్నుల్లో రిల‌య‌న్స‌ అధినేత ముఖేష్ అంబానీ ఒక‌రు.ఇటీవ‌ల ఆయ‌న అత్యంత ఖ‌రీదైన కారును కొన్నాడు.

 Ambani Who Bought The Most Expensive Car If You Know The Rate , Mukesh Ambani,-TeluguStop.com

దాని ధ‌ర వింటే మీరూ విస్తుపోతారు.ఎందుకంటారా దాని విలువ సుమారు రూ.13.14 కోట్లు.ఇది దేశంలోనే అత్యంత విలాస‌వంత‌మైన కారుగా పేరుగాంచింది.దీనిని ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ రోల్స్ రాయిస్ రూపొందించింది.ఇది హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్ కారు.దీనిని ముంబ‌యిలోని ఓ ఆర్టీఐ కార్యాల‌యంలో రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.ముఖేష్ అంబాని కొనుగోలు చేసిన ఈ కారు విలువ తొలినాళ్ల‌లో రూ.6.95 కోట్లు మాత్ర‌మే.క్ర‌మ‌క్ర‌మంగా దాని విలువ భారీగా పెరిగింది.

దానిని కొనుగోలు చేసిన అంబానీకి త‌న‌కు న‌చ్చిన విధంగా మార్పులు కూడా చేసుకున్న‌ట్టు స‌మాచారం.

ఇందుకు మ‌రో రూ.3కోట్లు వెచ్చించిన‌ట్టు స‌ద‌రు వ‌ర్గాలు తెలిపాయి.ఇలాంటి కార్లు దేశంలో త‌క్కువ సంఖ్య‌లో ఉన్నాయ‌ని తెలిపారు.

ఇలాంటి ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌ను ప్ర‌ముఖులు మాత్ర‌మే ఉప‌యోగిస్తారు.వాటి ధ‌ర కూడా కోట్ల రూపాయ‌ల్లో ఉంటాయ‌ని సంస్థ అధికారులు తెలిపారు.

అంబానీ కొన్న కారుకు ప్ర‌త్యేక నెంబ‌ర్ ప్లేటు క‌నుగోలు చేసి త‌న యూనివ‌ర్స‌ల్ నెంబ‌ర్ 0001గా తీసుకున్నారు.దీనికి సుమారు రూ.12ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు.మొత్తంగా కారు బ‌రువు సుమారు 2.5ట‌న్నుల బ‌రువు ఉంటుంది.ఇందులో 12 సిలండ‌ర్ల దాకా ఉంటాయి.వ‌న్ టైం కారు రిజిస్ట్రేష‌న్ కింద రూ.20ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు.దీని రిజిస్ట్రేష‌న్ కాల‌ప‌రిమితి 15 ఏండ్లు.రోడ్ ట్యాక్స్ కింద మ‌రో రూ.40వేలు చెల్లించిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

అయితే ఇలాంటి కారు కొనే భాగ్యం మాకెప్పుడు వ‌స్తుందో అంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Ambani Who Bought The Most Expensive Car If You Know The Rate , Mukesh Ambani, Viral News - Telugu Ambaniexpensive, Mukesh Ambani

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube