భూమిపై సముద్రాలు లేకుంటే బహుశా ఈ రోజు మన జీవితం ఇంత హాయిగా సాగేదికాదు.ఎందుకంటే మనిషి సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాడు.
ఎందుకంటే సముద్రం భూమి యొక్క ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది.ప్రపంచంలోని 70 శాతం మేరకు విస్తరించి ఉన్న సముద్రం గురించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత వేడిగా ఉండే మహాసముద్రం హిందూ మహాసముద్రం.దీని ఉపరితల ఉష్ణోగ్రత కొన్నిసార్లు 36.6 డిగ్రీల వరకు ఉంటుంది.భూభ్రమణం వల్ల సముద్రంలో అలలు వస్తాయి.
సముద్రంలో 2 లక్షల కంటే ఎక్కువ జాతుల జంతువులు నివసిస్తున్నాయి.సునామీ అనే పదం జపనీస్ పదం.దీని అర్థం ఎత్తైన సముద్రపు అలలు.సముద్రపు నీరు ఉప్పగా ఉండటానికి కారణంం ఇందులోని ఘన సోడియం క్లోరైడ్.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం భూమిపై జీవం ఏర్పడటానికి మూలం సముద్రం.
ప్రపంచంలో అతిపెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం.
ప్రపంచంలోనే అతి చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం.సముద్రం యొక్క సగటు లోతు 2.5 మైళ్లు అంటే దాదాపు 4 కిలోమీటర్లు.ఒక సర్వే ప్రకారం, ప్రపంచ మహాసముద్రాలలో దాదాపు 20 మిలియన్ల టన్నుల బంగారం ఉంది.
పసిఫిక్ మహాసముద్రంలో 25,000 ద్వీపాలు ఉన్నాయి.ప్రతి సంవత్సరం దాదాపు 14 బిలియన్ పౌండ్ల చెత్త సముద్రంలో కలుస్తోంది.
అట్లాంటిక్ మహాసముద్రంలో మెరిసే వృక్షసంపద ఉంది.అవి స్వయంగా ప్రకాశిస్తాయి.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సముద్రం 100 మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది.మనం తీసుకునే ఆక్సిజన్‌లో 70శాతం సముద్రాల ద్వారానే ఉత్పత్తి అవుతుంది.
ఓషనోగ్రఫీ అనేది సముద్రానికి సంబంధించిన అధ్యయనం.ఈ శాస్త్రాన్ని తొలుత కెప్టెన్ జేమ్స్ కుక్ ప్రారంభించారు.