ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉనప్పటి నుంచి మీమర్స్ ఎప్పుడెప్పుడు ఎవర్ని ట్రోల్ చేద్దామా అని ఎదురు చూస్తుంటారు.ముఖ్యంగా సెలబ్రెటీలను మాత్రం అస్సలు వదలరు.
హీరో హీరోయిన్ ల మధ్య ఏదైనా తేడా కనిపిస్తే చాలు వెంటనే ట్రోల్ చేసేస్తారు.అలా ఇప్పటికీ చాలా మంది హీరో హీరోయిన్ లను బాగా ట్రోల్స్ చేసారు.
ఇక తాజాగా జాతిరత్నాలు హీరోయిన్ ను కూడా దారుణంగా ట్రోల్ చేశారు. అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా థియేటర్లలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఇందులో నటించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.ఈమె ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఇక ఈ సినిమాలో తాను నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.ఇటీవలే నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో చేసి తన స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.ఇక ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉంది.
ఇక ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.
ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా చిట్టి అని లేదా పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు.ఎందుకంటే ఈ అమ్మడు ఏకంగా ప్రభాస్ హైట్ నే మించి ఉంటుంది కాబట్టి.
ఈమె చూడటానికి చాలా పొడవుగా ఉంటుంది.జాతి రత్నాలు ప్రమోషన్స్ భాగంలో ప్రభాస్ తో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా.
ప్రభాస్ ఫరియా హైట్ చూసి షాక్ అయ్యాడు.
ఈవిడ ఏంటి నా హైట్ కంటే మించి పోయింది అని కామెంట్ కూడా చేశాడు.
అలా చాలా మంది ఈమె హైట్ విషయంలో బాగా ట్రోల్స్ కూడా చేయగా తాజాగా మీమర్స్ కూడా ఓ మీమ్ క్రియేట్ చేశారు.అందులో తాను పలువురు సెలబ్రెటీలతో కలిసి ఫోటో దిగగా.
ఆ ఫోటోలో ఫరియా అందరికంటే హైట్ గా ఉంది.దీంతో మీమర్స్ ఆ ఫోటోను బ్రహ్మానందం ఫోటోతో ట్రోల్ చేసారు.
బ్రహ్మానందం ఓ సినిమాలో పిల్లలతో కలిసి ఫోటో దిగగా అందులో బ్రహ్మానందం హైట్ గా ఉంటాడు.దీంతో ఆ ఫోటోను చిట్టీ ఫోటోతో ట్యాగ్ చేసి ఫన్నీగా క్రియేట్ చేశారు.ప్రస్తుతం ఆ మీమ్ నెట్టింట్లో వైరల్ గా మారగా.నెటిజన్లు ఆ ఫోటోను చూసి తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.ఇక కొందరు బ్రహ్మానందం హైట్ ను కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
.