దేశవ్యాప్తంగా కరోనా కేసులు లక్షలు నమోదవుతున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్ లైన్ ద్వారా….
తరగతులు నిర్వహించాలని సూచించడం జరిగింది.కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలు ఓపెన్ చేయటం పట్ల…వైసీపీ ప్రభుత్వం పై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితిని.
ఎప్పటికప్పుడు కలెక్టర్ స్థాయిలో సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఇక ఇదే సమయంలో కరోనా సోకిన ఉపాధ్యాయులకు వెంటనే సెలవులు ఇస్తున్నట్లు కూడా తెలిపారు.అన్ని స్కూళ్లకు శానిటైజర్ చేస్తున్నామని.
స్పష్టం చేశారు.
మరీ ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారని ఎటువంటి భయం అవసరం లేదని ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణలో మాత్రం కేసులు పెరుగుతూ ఉండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చిన సెలవులు మరింత పొడిగించడం జరిగింది.