కొన్ని సార్లు అంతే.చిన్న మిస్టేక్ పెద్ద ఇబ్బందికి దారి తీస్తుంది.
బ్యాంకుల విషయానికి వస్తే ఒక్కోసారి ఒకరికి కొట్టాల్సిన నగదును మరొకరికి బదిలీ చేయడం లాంటి ఘటనలు ఈ మధ్య చాలా చూస్తున్నాం.ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు.
ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు ఒకరి అకౌంట్ లోకి కొట్టాల్సిన నగదును మరొకరికి బదిలీ చేస్తుంటారు చాలామంది.అలా నగదు ఇతరుల అకౌంట్లలోకి వెళ్తే మాత్రం.
వారు అంత డబ్బు తమ అకౌంట్ లోకి రావడంతో చాలా సంతోషిస్తారు.ఆ డబ్బు మొత్తం తమకే అనుకుంటారు.
ఇలా మొన్న మధ్య ప్రదేశ్ లో కొందరు బిజినెస్ పర్సన్లకు సంబంధించిన నగదు మొత్తం.చిరు వ్యాపారాలు చేసుకునే వారి అకౌంట్లలో జమ కావడం కూడా మనం చూశాం.
ఇలా డబ్బులు ఇంకొకరి అకౌంట్లలోకి జమ కావడంతో వారందరికీ బ్యాంకు అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు.అయితే ఇప్పుడు ఇలాంటి ఘటనే ఓ వృద్ధుడికి ఎదురయింది.
అతను పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నాడు.ఇక ఎప్పటి లాగే తన పింక్షన్ డబ్బుల కోసం బ్యాంకు కు వెళ్లాడు.
ఝార్ఖండ్‌లో ఉంటున్న ఫూలోరాయ్ బ్యాంకుకు వెళ్లాడు.
అయితే అతని అకౌంట్ లో ఉన్న పింక్షన్ డబ్బుల్లోంచి రూ.10,000 విత్ డ్రా చేసుకున్నాడు.ఇక తన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ను కూడా చెక్ చేయించుకునేందుకు రూ.75.28 కోట్లు ఉన్నట్టు చెప్పేసరికి షాక్ అయిపోయాడు.పింక్షన్ మీద ఆధారపడి బతికే తన దగ్గర అంత డబ్బు ఎక్కడిది అంటూ అడిగాడు.ఇక ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని వివరించాడు.ఇక బ్యాంకు అధికారులు ఆ ఘటన మీద ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఇలా జరిగి ఉంటుదని భావిస్తున్నారు.
అయితే ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
.