చిరిగిన జీన్స్ ఫ్యాష‌న్ ఎలా మొద‌ల‌య్యిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

రిప్డ్ జీన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది.జీన్స్ స‌రే… ఈ రిప్డ్ జీన్స్ అంటే చిరిగిన జీన్స్ ఫ్యాష‌న్‌గా ఎప్ప‌టి నుంచి మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.

 Wonder If You Know How The Ripped Jeans Fashion Started , Fashion , Trend , Ripp-TeluguStop.com

జీన్స్‌ను 1870లో కనిపెట్టిన‌ప్ప‌టికీ.దాదాపు 100 సంవత్సరాల తర్వాత అంటే 1970లో రిప్డ్ జీన్స్ ఫ్యాషన్ వచ్చింది.1970కి ముందు చిరిగిన జీన్స్ వేసుకుంటే వారిని పేదవారిగా చూసేవారు.అయితే 1970ల తర్వాత, ఇది ఫ్యాషన్‌గా మారింది.

ప‌లు కంపెనీలు చిరిగిన జీన్స్ తయారు చేయడం ప్రారంభించాయి. రిప్డ్ జీన్స్ సంస్కృతి పంక్ యుగంలో ప్రారంభమైందని చెబుతారు.

పంక్ అనేది 1970లలో ప్రారంభ‌మైన‌ సంగీత శైలి.

ఇది 1960ల గ్యారేజ్ బ్యాండ్ ప్రభావంతో మొద‌ల‌య్యింది.

అదే సమయంలో, పంక్ ఉద్యమం ప్రారంభమైంది, నిరసనకు చిహ్నంగా జీన్స్ మారింది.చిరిగిన జీన్స్ మరియు జాకెట్ల వాడకం పెరిగింది.ఆ సమయంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా చిరిగిన జీన్స్‌తో నిరసనలు తెలిపారు.1990లో హార్డ్ రాక్, హెవీ మెటల్ యుగంలో.2000లో గ్రంజ్ యుగంలో ఇటువంటి జీన్స్ సంస్కృతి గణనీయంగా పెరిగిందని అనేక విదేశీ ఫ్యాషన్ వెబ్‌సైట్‌లు తెలిపాయి.ఇప్పటి యువ‌త మామూలు జీన్స్ క‌న్నా, చిరిగిన జీన్స్ పైన‌నే మ‌క్కువ చూపించ‌డం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube