ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.అక్కడ చేసే పనికి అత్యధిక వేతనాలు దొరకడమే వలసలు వెళ్ళడానికి ప్రధాన కారణం.
అంతేకాదు చాలా ప్రాంతాలలో కార్మికులకు రోజూ పని ఉండక పోవచ్చు కానీ గల్ఫ్ దేశాలలో నిత్యం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కాబట్టి ఎంతో మంది ఆయా దేశాలకు వలసలు వెళ్లేందుకు ఆశక్తి చూపుతుంటారు.అయితే గడిచిన కొంత కాలంగా గల్ఫ్ దేశాలలో పనిచేసే వలస వాసులను ఎన్నో రకాల ఆంక్షలు విధిస్తూ వారిని కొలువుల నుంచీ తొలగిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
తాజా లెక్కల ప్రకారం
గల్ఫ్ దేశమైన కువైట్ లో కేవలం ఒక్క ఏడాది కాలంలో సుమారు 18 వేల మందిని దేశం నుంచీ బహిష్కరించారట.ఈ విషయాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది.
దాదాపు 18వేల మందిపై వేటు వేయడానికి గల కారణాలు కూడా వెల్లడించింది.వీరందరూ వలస వాసులు పాటించాల్సిన నిభంధనలు పాటించని వారని, వీరిలో సుమారు 12 వేల మంది వరకూ పురుషులు ఉండగా మిగిలిన వారు స్త్రీలు ఉన్నారని తెలుస్తోంది.
కువైట్ చట్టాలని ఉల్లంఘించిన కారణంగా వీరందరిపై చట్టపరమైన చర్యలలో భాగంగానే దేశ బహిష్కరణ వేటు వేసినట్టుగా మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కరోన నాటి నుంచీ కువైట్ దేశం నిభందనలు కటిన తరం చేసింది.
అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ల విషయంలో వీసా రెన్యువల్స్ విషయంలో ఇలా పలు రకాల నిభందనలు వీరు ఉల్లంఘించిన కారణంగానే వీరిపై బహిష్కరణ వేటు పడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.ఇదిలాఉంటే కువైట్ తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన కరంగా ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్ళవద్దని ఆదేశించింది.