కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడుపునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది.
పునీత్ మరణవార్తను ఇప్పటికి తన అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.పునీత్ చనిపోయిన తరువాత అతను చేసిన గొప్ప గొప్ప పనులు అందరికీ తెలిసాయి.
అంతే కాకుండా అతను చనిపోయిన తరువాత సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదు అని తాను చేసే సేవా కార్యక్రమాల కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన గొప్ప వ్యక్తి పునీత్ రాజ్ కుమార్.
బతికుండగా ఎంతోమంది ప్రజల మనసులలో స్థానం సంపాదించుకున్న పునీత్, చనిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఇక పునీత్ రాజ్ కుమార్ గొప్పతనం ఎలాంటిది అంటే అతడి మరణవార్త విన్న చాలా మంది అభిమానులు గుండెపోటుతో మరణించడమే కాకుండా కొందరు అయితే సూసైడ్ కూడా చేసుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పట్లో పునీత్ రాజ్ కుమార్ ఒకచోట ఒక్క రూపాయి కూడా పారితోషికం కూడా తీసుకోకుండా పదేళ్లపాటు పని చేశాడట.
కర్ణాటక మిల్క్ ఫెడ్రేషన్ పునీత్ రాజ్ కుమార్ ఫోటోను నందిని పాల పాకెట్ పై ప్రింట్ చేయించి నివాళి అర్పించారు.పునీత్ రాజ్ కుమార్ తన తండ్రి డా.రాజకుమార్ అడుగుజాడల్లో నడిచి ఒక్క రూపాయి కూడా పారితోషికం లేకుండా పదేళ్లు కర్ణాటక మిల్క్ ఫెడ్రెషన్ కు అంబాసిడర్ గా పని చేశారు.దీంతో ఇప్పుడు పునీత్ ఫోటో పాల పాకెట్ పై ముద్రించి నివాళి అర్పించారు.దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది