రాజమౌళి.. దానయ్య.. 13 ఏళ్ల కథ..!

RRR సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి అండ్ టీం బుధవారం సాయంత్రం కేరళలో ఈవెంట్ నిర్వహించారు.ఈ క్రమంలో ఎన్.

 Rrr Rajamouli Dvv Danaiah 13 Years Story   , Dvv Danaiah , Jakkanna , Latest Mov-TeluguStop.com

టి.ఆర్, రాం చరణ్ ఒకరి మీద ఒకరు చేసుకున్న కామెంట్స్ వైరల్ గా మారాయి.ఇద్దరి స్టార్స్ మధ్య ఈ సాన్నిహిత్యం అందరిని అలరిస్తుంది.ఈ క్రమంలో నిర్మాత డివివి దానయ్య గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు రాజమౌళి.దానయ్య గారితో 13 ఏళ్ల నుండి సినిమా చేద్దామని అనుకున్నా మర్యాద రామన్న టైం లో అడిగితే మీతో సినిమా తీస్తే అది భారీగా ఉండాలని అన్నారు.అందుకే ఆర్.

ఆర్.ఆర్ సినిమా ఆయనతో తీశానని అన్నారు రాజమౌళి.

13 ఏళ్లుగా రామమౌళితో సినిమా కోసం ఎదురుచూసిన దానయ్య ఆర్.ఆర్.ఆర్ తో ఆ కోరిక తీర్చుకున్నాడు.ఆర్.ఆర్.ఆర్ సినిమా తీసినందుకు చరణ్, తారక్, రాజమౌళితో పాటుగా నిర్మాతగా దానయ్యకి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని అంటున్నారు.జనవరి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.

సినిమా ట్రైలర్ తోనే రికార్డులు సృష్టించగా అసలు బొమ్మ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube