తెలుగు లో పలు రకాల షో లు ఈవెంట్లు హలో యాంకరింగ్ నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు బ్యూటిఫుల్ లాస్య మంజునాథ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ లాస్య మంజునాథ్ మొదటగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మ్యూజిక్ ఛానల్ లో ప్రసారమయ్యే పాటల కార్యక్రమంలో యాంకరింగ్ నిర్వహిస్తూ తన సినీ కెరీర్ ని ఆరంభించింది.
ఆ తర్వాత క్రమక్రమంగా అడపాదడపా చిత్రాల్లో కూడా అప్పుడప్పుడు కనిపించింది.కానీ ఆ మధ్య లాస్య ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమయ్యే ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అవకాశాలను కూడా బాగానే దక్కించుకుంటోంది.
అయితే ఈ మధ్య కాలంలో నటి లాస్య మంజునాథ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పలు రియల్స్ మరియు ఫోటోలను షేర్ చేస్తూ రోజురోజుకి తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.
అయితే తాజాగా లాస్య మంజునాథ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ రీల్ ని షేర్ చేస్తూ.
అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ రీల్ లో ఏముందంటే లాస్య మంజునాథ్ భోజనం చేస్తుండగా తన ప్రియుడు ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పినప్పటికీ ఏ మాత్రం ఫీలవకుండా భోజనం తింటూ కనిపించింది.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అలాగే కొందరు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ రీల్ వీడియో కావడంతో లాస్య మంజునాథ్ బాగానే నటించిందని కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ, పెళ్ళి వంటి బంధాలకి చాలా విలువ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆ మధ్య ఏకంగా గా లాస్య మంజునాథ్ తెలుగు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలోని ఉ అంటావా మావా ఉహూ అంటావా అనే పాట కి రీల్ చేస్తూ ఏకంగా తన భర్త మంజునాథ్ ని బెదిరిస్తూ అంట్లు తోమించింది.దీంతో ఈ వీడియో కూడా బాగానే వైరల్ అయింది.అయితే లాస్య మంజునాథ్ తన భర్తతో కలిసి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య మంజునాథ్ ఇటు లైఫ్ ని మరియు అటు పర్సనల్ లైఫ్ ని బాగానే బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతోంది.
ఇక ప్రస్తుతం యాంకర్ లాస్య మంజునాథ్ తెలుగు లో పలు రకాల షోలు ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే సంపాదిస్తోంది మరోపక్క యూట్యూబ్లో కూడా సొంతంగా ఛానల్ ని నిర్వహిస్తూ బాగానే అలరిస్తోంది.దీంతో ప్రస్తుతం లాస్య మంజునాథ్ యూట్యూబ్ ఛానల్ అయిన లాస్య టాక్స్ కి దాదాపుగా 11 లక్షల పైచిలుకు మంది సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు.