పవన్ తో త్రివిక్రమ్.. వినోదయ సీతం రీమెక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలన్నా సరే అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రం ప్రమేయం ఉండాల్సిందే.అలా వాళ్లిద్దరికి సెట్ అయ్యింది.

 Pawan Kalyan Trivikram Kollywood Vinodaya Sitham Remake-TeluguStop.com

పవన్ తో త్రివిక్రం ఆల్రెడీ హ్యాట్రిక్ సినిమాలు చేశాడు.ఇప్పుడు వస్తున్న భీమ్లా నాయక్ కూడా పేరుకే డైరక్టర్ సాగర్ చంద్ర కాని వెనక నడిపిస్తున్నది అంతా త్రివిక్రం అని తెలుస్తుంది.

ఇక పవన్ కోసం మరో రీమేక్ సెలెక్ట్ చేశాడట త్రివిక్రం.

Telugu Hhvm, Latest, Pawan Kalyan, Samudrakhani, Tollywood, Trivikram, Vinodaya

కోలీవుడ్ లో సముద్రఖని నటించి డైరెక్ట్ చేసిన వినోదయ సీతం సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రం.ఈ సినిమాకు త్రివిక్రం దర్శకుడిగా కాకుండా నిర్మాతగా బాధ్యత వహిస్తారని తెలుస్తుంది.సినిమాకు మాత్రుక దర్శకుడు సముద్రఖనినే ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి పవర్ స్టార్ తో త్రివిక్రం మరో రీమేక్ కు రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.పవన్ చేస్తున్న హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు అయ్యాక ఈ రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

సినిమాను త్రివిక్రం తన ప్రొడక్షన్ లో నిర్మిస్తారట.ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ రాం రాళ్లూరి కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube