బాలయ్య అన్ స్టాపబుల్.. గెస్ట్ గా మహేష్ ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో వస్తున్న క్రేజీ షో అన్ స్టాపబుల్.ఈ షోతో బాలయ్య బాబు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు.

 Balakrishna Unstoppable Mahesh Guest Fourth Episode, Balakrishna , Unstoppable-TeluguStop.com

ప్రస్తుతం థర్డ్ ఎపిసోడ్ లోడింగ్ అవుతుండగా త్వరలో ఈ షోలో నాల్గవ ఎపిసోడ్ షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది.బాలయ్య అన్ స్టాపబుల్ ఫోర్త్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ వస్తున్నాడని టాక్.

మహేష్, బాలకృష్ణ కచ్చితంగా ఈ కాంబో సూపర్ హిట్ అని చెప్పొచ్చు.మహేష్ తో బాలకృష్ణ రిలేషన్ ఎలా ఉంటుంది.

వారిద్దరు ఎలా మాట్లాడతారు అన్న దాని మీద ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.ఆహా కోసం బాలకృష్ణ బాగానే కష్టపడుతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం రాబోతున్న 3వ ఎపిసోడ్ లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి సందడి చేయనున్నారు.డిసెంబర్ 4న మహేష్, బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ ఉంటుందని టాక్.

మహేష్ ఈమధ్యనే ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ.ఎం.కే షోకీ గెస్ట్ గా వెళ్లాడు.ఆ షో కూడా డిసెంబర్ 4న టెలికాస్ట్ ప్లాన్ చేశారు.

సో నందమూరి హీరోలతో మహేష్ వరుస ఇంటరాక్షన్ ఆ ఫ్యాన్స్ కు దగ్గరయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube