సాధారణంగా సినిమా అంటే కేవలం పౌరాణిక చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు మాత్రమే కాకుండా దేవుళ్ళ చిత్రాలు కూడా తెరకెక్కిస్తున్నారు.ఈ క్రమంలోనే దేవుడు సినిమాలు వచ్చినప్పుడు కేవలం ఒక దేవుడికి సంబంధించిన చరిత్ర గురించి ఆ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తారు.
ఇప్పటికే అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయిబాబా, అమ్మోరు వంటి ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశాయి.ఇలా ఒక సినిమాలో కేవలం ఒక దేవుడు మాత్రమే కాకుండా ఒకే సినిమాలో అందరి దేవుళ్ళను చూపించిన ఘనత డైరెక్టర్ కోడి రామకృష్ణకి దక్కుతుందని చెప్పవచ్చు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కోడి రామకృష్ణ ప్రస్థానం ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన ఒక స్టార్ దర్శకుడిగా ఎంతో మంది హీరో, హీరోయిన్లను స్టార్ సెలబ్రిటీలుగా మార్చారు.
ఇలా కోడి రామకృష్ణ స్టార్ హీరో, హీరోయిన్ ల తో తీసిన సినిమాలు ఒక్కసారిగా వరుసగా నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈయన సెలబ్రిటీల కంటే.స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకోవాలని తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే తన తరువాత ప్రాజెక్టును ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు చిన్న పిల్లలను ప్రధాన పాత్రలో పెట్టి సినిమాని ప్రకటించడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.
ఇక ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా ఇందులో సుమన్, రాజేంద్ర ప్రసాద్, లయ, శ్రీకాంత్, రమ్యకృష్ణ, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి సెలబ్రిటీలను దేవుళ్లుగా ప్రకటించారు.అలాగే ఇందులో రాశి, హీరో పృధ్వీ రాజ్ నటించారు.ఇలా అందరి దేవుళ్లతో తెరకెక్కిన దేవుళ్ళు చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో పలు మనస్పర్థల కారణంగా విడిపోయిన తల్లిదండ్రులను కలపడం కోసం ఆ చిన్నారులు ముడుపులు కట్టి ఆ ముడుపులు ప్రతి ఆలయంలో స్వామివారికి అందిస్తూ.ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు చివరికి వారి తల్లిదండ్రులను ఎలా కలిపారన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఇలా కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవుళ్ళు సినిమా 2020 నవంబర్ 10వ తేదీన విడుదల అయింది.ఈ సినిమా మొదటి షో తోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోడిరామకృష్ణ తన ఏంటో మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నారు.ఇక ఇలా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తరువాత ఈ సినిమాకు ఏకంగా నంది అవార్డు కూడా రావడం విశేషం.ఇక ఈ సినిమా విడుదలైన రోజే చిరునవ్వుతో, కాలేజ్ అనే చిత్రాలు కూడా విడుదలయ్యాయి.
ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడం విశేషం.దేవుళ్ళు సినిమా విడుదలయ్యి సుమారు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో మంది భక్తులను కూడా ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.