ఒక భాషలో ఒక సినిమా విడుదలై భారీ వసూళ్లతో మంచి హిట్ అందుకుందంటే చాలు ఇతర భాషల దర్శకులు, హీరోలు ఆ సినిమాపై ఆసక్తి చూపుతారు.ఎలాగైనా తమ భాషలో ఆ సినిమా విడుదల చేయాలని అనుకొని భారీ బడ్జెట్లతో రీమేక్ చేస్తుంటారు.
అలా ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలు వచ్చాయి.దీంతో కొన్ని కొన్ని సార్లు రీమేక్ గా విడుదలైన మంచి సక్సెస్ అందుకుంటుంది.
కొన్ని కొన్ని సార్లు అంతగా మెప్పించలేక పోతుంది.ఒకటే కథను ఎలాంటి మార్పులు లేకుండా తీసుకున్న కూడా ఆ సినిమా కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులను మెప్పించలేకపోతుంది.
ఎందుకంటే కథ పరంగా మంచి డిమాండ్ ఉన్న నటుల నటన పరంగా అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆ సినిమా ఎంత హిట్ కావాల్సిన సినిమా అయినా సరే ఫ్లాప్ అవుతుంది.అలా పుణ్యభూమి నాదేశం సినిమా పరిస్థితి కూడా అలాగే మారింది.ఇంతకు అసలేం జరిగిందో ఆ సినిమా ఏ భాష నుండి రీమేక్ గా తీసుకున్నారో చూద్దాం.
1995లో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుణ్యభూమి నా దేశం’.ఈ సినిమాలో మోహన్ బాబు, మీనా, దాసరి నారాయణ, అన్నపూర్ణ, గొల్లపూడి మారుతి రావు తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించాడు.ఇక ఈ సినిమాను హిందీ సినిమా నుండి రీమేక్ గా తీసుకున్నారు.
హిందీలో 1994లో క్రాంతి వీర్ అనే టైటిల్ తో ఈ సినిమా విడుదలైంది.అంటే తెలుగు సినిమా కంటే ఒక ఏడాది ముందు ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమాకు మేహుల్ కుమార్ దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రధాన పాత్రలో నానాపటేకర్ నటించాడు.ఈ సినిమాలో కీలకపాత్ర బాగా ఆసక్తిగా ఉంటుంది.తనకు నచ్చినట్లుగా బాధ్యతలు లేకుండా ఉండే ప్రతాప్ తిలక్ అనే ఓ వ్యక్తి ప్రజల విషయంలో బాగా శ్రద్ధ గా ఉంటాడు.
అలా ప్రతాప్ తిలక్ అనే పాత్రను అద్భుతంగా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు నానాపటేకర్.ఇక దర్శకుడికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఎంతో మంది ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.పైగా భారీ వసూళ్లు కూడా సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాను కోదండరామిరెడ్డి మోహన్ బాబుతో తన దర్శకత్వంలో రీమేక్ చేయాలని అనుకొని మొత్తానికి ఆ తర్వాత ఏడాదికి తెరకెక్కించాడు.
దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా ముందు బాగా ఆశలు పెట్టుకున్నారు.
అంతేకాకుండా ఎంతోమంది ఈ సినిమా కోసం ఎదురు చూశారు.కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
నిజానికి మోహన్ బాబు తన పాత్రతో బాగా మెప్పించాడు.కానీ ప్రేక్షకులే మోహన్ బాబు పాత్రను నానా పటేకర్ పాత్ర తో పోల్చటం తో మోహన్ బాబు కాస్త నిరాశ పరిచినట్లు తెలిసింది.