రంగస్థలం, ఖైదీ నెంబర్-150 సినిమాల విషయంలో గెటప్ శ్రీను చేసిన పెద్ద తప్పులేంటో తెలుసా?

స్మార్ట్ ఫోన్లు వచ్చాక.సోషల్ మీడియా పరిధి బాగా పెరిగింది.

 Getup Srinu About His Career Mistakes Details, Getup Srinu, Getup Srinu Mistakes-TeluguStop.com

ఏ చిన్న ఘటన జరిగినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.రాజకీయాలు మొదలుకొని.

సినిమా విషయాల వరకు ఏదైనా క్షణాల్లో రచ్చ రచ్చ అవుతుంది.అలాగే కొంత కాలం క్రితం రంగస్థలం సినిమా షూటింగ్ స్పాట్ లో కొందరు వ్యక్తిలు ఓ రోలును పైకి లేపేందుకు బాగా ప్రయత్నిస్తున్న సమయంలో గెటప్ శ్రీను వచ్చి దాన్ని ఎడమ చేతితో లేపి పక్కన పెడతాడు.

అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.అయితే ఈ పని చేయడం మూలంగా చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పాడు గెటప్ శ్రీను.

ఇంతకీ ఆయన ఏ ఏ విషయాలు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

తాను ఈ వీడియో తీసినప్పుడు రంగంస్థలం సినిమాలో ఆ రోలు సీన్లు షూట్ చేయలేదని చెప్పాడు.

అప్పటికే తాము ఆ ప్రాపర్టీస్ తో కామెడీ గా తీసిన వీడియో వైరల్ కావడంతో దర్శకుడు సెట్ బాయ్స్, అసిస్టెంట్ డైరెక్టర్లపై ఓ రేంజిలో కోప్పడ్డట్లు వెల్లడించాడు.అంత ఈజీగా సెట్ ప్రాపర్టీస్ వాడుతుంటే మీరేం చేస్తున్నారని ఫైర్ అయినట్లు చెప్పాడు.

తమను మాత్రం ఒక్క మాట కూడా అనలేదని చెప్పాడు.అయితే జరిగిన తప్పుకు అసిస్టెంట్ దర్శకులతో పాటు సెట్ ప్రాపర్టీస్ వ్యక్తులకు కూడా సారీ చెప్పినట్లు శ్రీను వెల్లడించాడు.

Telugu Chiranjeeiv, Chiranjeevi, Getup Srinu, Jabardasthgetup, Khaidi, Leaked, N

అటు ఖైదీ నెంబర్150 సినిమాలోనూ తాను ఓ పెద్ద తప్పు చేసినట్లు వెల్లడించాడు.ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి ఫస్ట్ లుక్ ఫోటో తన మూలంగానే బయటకు లీక్ అయ్యిందని చెప్పాడు.దీంతో తాను చాలా టెన్షన్ పడినట్లు వెల్లడించాడు.అయితే.జరిగిన విషయాన్ని వెళ్లి నాగబాబుకు చెప్పినట్లు వెల్లడించాడు.తను చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లాడని.

దానికి తను మామూలుగానే రియాక్ట్ అయ్యాడని చెప్పాడు.ఎప్పుడైనా బయటకు రావాల్సిందే కదా.కానీ కాస్త ముందే వచ్చింది.ఏంకాదులే అన్నాడని చెప్పాడు.

అప్పుడు తాను రిలాక్స్ అయినట్లు వెల్లడించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube