రాగి పాత్రల్లోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు

ప్రాచీన కాలంలో రాగి చెంబులో నీళ్లు తాగుతుండేవారు.అది చాలా మంచి అలవాటు.

 Water In Copper Vessels Is Very Good For Health, Copper Utensils, Water ,drinks-TeluguStop.com

ప్రస్తుత కాలంలో ఆ అలవాటు కనుమరుగైపోయింది.అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలా చోట్ల రాగి పాత్రలను, బిందెలను వినియోగిస్తున్నారు.

రాగి చెంబులో నీళ్లు తాగటం వల్ల చాలా మంది ఆరోగ్యంగా ఉండేవారు.ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద శ్రద్ద పెరగడం వల్ల పట్టణాల్లో సైతం రాగి చెంబులను, పాత్రలను వాడుతున్నారు.

రాత్రంతా రాగి పాత్రలో నీటిని నిల్వ చేసి ఉదయాన్నే ఆ నీళ్లను తాగితే ఆరోగ్యంగా ఉంటారు.ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుందని ఆయుర్వేదం ఎప్పటి నుంచో తెలియజేస్తోంది.

శరీరానికి కావాల్సిన ముఖ్య ఖనిజాలలో రాగి ఎంతో అవసరమైనది.ఆకుకూరలు, తేనె వంటి వాటిలో కాపర్ పుష్కలంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు.

దాంతో పాటుగా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు తాగడం వల్ల కాపర్ శరీరానికి చేరుతుందని గ్రహించాలి.రాగిపాత్రలో నీటిని కనీసం 8 గంటలైనా నిల్వ ఉంచితే తగిన ప్రయోజనం కలుగుతుంది.

క్యాన్సర్ సమస్య తగ్గడానికి రాగి బాగా ఉపయోగపడుతుంది.రాగి పాత్రలో నీళ్లు తాగితే థైరాయిడ్ సమస్యలు ఉండవు.శరీరంలో కాపర్ నిల్వలు బాగా ఉంటే థైరాయిడ్ సమస్యను పోగొట్టవచ్చు.థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా రాగి నీళ్లు బాగా మెరుగుపరుస్తుందని తెలుసుకోవాలి.రాగి పాత్రలోని నీళ్లు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.కడుపులో ఉన్నటువంటి పుండ్లను రాగి నయం చేస్తుంది.జీర్ణక్రియ సమస్యతో బాధపడే వారికి రాగిపాత్రలోని నీళ్లు బాగా ఉపయోగపడతాయి.రాగి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియాలు తొలగిపోతాయి.

శరీరంలోని వ్యర్థాలను రాగి బయటకు పంపుతుంది.అంతేకాకుండా కొవ్వును రాగి కరిగిపోయేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు రాగి నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం.కాబట్టి రాగి పాత్రల్లోని నీళ్లు తాగడం ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube