తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎప్పటి నుండో పోరాడుతున్నామని ఆయన వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్రంలోనే కేసీఆర్ అతిపెద్ద అవినీతిపరుడని.
ఆయన చేసిన అక్రమాల విషయంలో అమిత్ షా కి ఫిర్యాదు చేయాలని అపాయింట్మెంట్ కోసం గత ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నట్లు రేవంత్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు.కెసిఆర్ చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.
అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే బయటపెడతామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడితే నీళ్లు, నియామకాలు అన్నీ మన చేతుల్లో ఉంటాయని తెలంగాణ ప్రజలను నిర్మించిన కెసిఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.
రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు.కమీషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లను కేసీఆర్ రీడిజైన్ చేయడం జరిగిందని.స్పష్టం చేశారు.ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లను.
కేసిఆర్ దోచుకున్నారని.నిజంగా కేసీఆర్ కి దమ్ముంటే కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సి బి ఐ ఎంక్వయిరీ వేయించే దమ్ము ఉందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
కెసిఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి పాల్పడింది అన్న దానికి సంబంధించి తన దగ్గర రుజువులు ఉన్నాయని నిరూపిస్తానని, ఒకవేళ ఆ రోజులు అబద్ధమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా.అంటూ రేవంత్ రెడ్డి కెసీఆర్ కి సంచలన సవాల్ విసిరారు.