చత్రపతి రీమేక్ ఎంత వరకు వచ్చిందో చెప్పిన బెల్లంకొండ

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ప్రభాస్ రేంజ్ ను ఓ రేంజ్ కు తీసుకు వెళ్లిన సినిమా అది.

 Prabhas Chatrapathy Movie Remake In Hindi Shooting Update, Prabhas , Chatrapath-TeluguStop.com

ప్రభాస్ ను తెలుగు లో టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమా వచ్చి చాలా ఏళ్లు అయ్యింది.ఈ సమయంలో సినిమా రీమేక్ ను చేసేందుకు సిద్దం అయ్యారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పెన్ స్టూడియో వారు వినాయక్ దర్శకత్వం లో సినిమాను హిందీ లో రీమేక్ చేస్తున్నారు.భారీ అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అసలు చత్రపతి సినిమా హిందీ వర్షన్‌ ఎలాంటి హడావుడి లేకపోవడంతో షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో చిత్రం షూటింగ్‌ జరుగుతుందని బెల్లం కొండ శ్రీనివాస్ చెప్పకనే చెప్పాడు.

చత్రపతి హిందీ వర్షన్ షూటింగ్‌ స్పీడ్ గా సాగుతోంది.ఈ సినిమాలో కీలక పాత్రలో లెజెండ్రీ కమెడియన్ జానీలీవర్‌ నటిస్తున్నాడు.

ఆయన మరియు బెల్లంకొండ బాబు కాంబోలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా.ఈ కాలం కు తగ్గట్లుగా కథలో మార్పులు చేయడం జరిగిందట

Telugu Bellamkondasai, Bollywood, Chatrapathy-Movie

ఆ మార్పులను విజయేంద్ర ప్రసాద్‌ చేశాడని.రాజమౌళి బ్యాక్ గ్రౌండ్ లో సలహాలు సూచనలు చేస్తూ ఉండగా సినిమా రీమేక్ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్ వచ్చే జనవరిలో షూటింగ్‌ ను పూర్తి చేసుకుని సినిమా ను వచ్చే సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

భారీ ఎత్తున ఈ సినిమా కు ఖర్చు చేస్తున్నారని పెన్ ఇండియా స్టూడియో వర్గాల వారు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube