హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ హవా ..!!

తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.హోరాహోరీగా ఈ ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహించాయి.

 Trs Lead In Huzurabad By Election Postal Ballot Trs, Huzurabad By Election ,trs-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ఈ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.చాలావరకు హోరాహోరీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య నడిచినట్లు వార్తలు వస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే హుజురాబాద్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార పార్టీ టిఆర్ఎస్ హవా నడుస్తోంది.కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. 14 టేబుల్లో ఇరవై రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది.

తొలుత బ్యాలెట్ ఓట్లు ఆ తర్వాత ఈవీఏమ్ ఓట్లను లెక్కిస్తూ ఉండగా.బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది.

హుజూరాబాద్ నియోజకవర్గం లో ఒక్కో మండలంలో పరిస్థితి ఒకలా ఉండటం తో వివిధ పార్టీల నాయకులు ఎవరికివారు ఖచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందని ధీమాగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.కాగా మొత్తం ఎన్నికల ఫలితం ఈరోజు మధ్యాహ్ననికి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube