భీమ్లా నాయక్ రికార్డ్ బ్రేక్ చేయలేక పోయిన ఆర్‌ ఆర్‌ ఆర్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా గ్లిమ్స్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయడం జరిగింది.అద్బుతమైన విజువల్ వండర్ గా సినిమా ఉండబోతుంది అన్నట్లుగా ఆ గ్లిమ్స్ చూస్తుంటే అనిపిస్తుంది.

 Rrr Glimpse Not Break Pawan Bheemla Nayak Movie Glimpse Record , Rrr Glimpse ,-TeluguStop.com

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఈ గ్లిమ్స్ కు భారీ వ్యూస్ వచ్చాయి.అన్న భాషలకు కలిపి ఒకే గ్లిమ్స్ ను విడుదల చేశారు.

భాష తో సంబంధం లేకుండా ఉన్న ఈ గ్లిమ్స్ ను ఖచ్చితంగా జనాలు భారీ ఎత్తున చూడటం.రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం ఖాయం అనుకున్నారు.

కాని అనూహ్యంగా ఈ సినిమా గ్లిమ్స్ భీమ్లా నాయక్‌ రికార్డును బ్రేక్ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.పవన్‌ భీమ్లా నాయక్‌ గ్లిమ్స్మూడు లక్ష ల వ్యూస్ ను 73 నిమిషాల్లో దక్కించుకున్న విషయం తెల్సిందే.

అలాగే నాలుగు లక్షల వ్యూస్ ను 143 నిమిషాల్లో దక్కించుకుంది.ఈ రికార్డును ఆర్‌ ఆర్‌ ఆర్‌ బ్రేక్ చేయలేక పోయింది.

Telugu Ajay Devgan, Bheemla Nayak, Pawan, Ramcharan, Rrr Glimpse-Movie

మొదటి లక్ష వ్యూస్‌ విషయంలో మాత్రం భీమ్లా నాయక్‌ రికార్డ్‌ ను ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేసింది.మొదటి లక్ష వ్యూస్‌ కు భీమ్లా నాయక్ కు 17 నిమిషాలు పట్టగా.ఆర్ ఆర్‌ ఆర్‌ కు మాత్రం కేవలం 12 నిమిషాలే పట్టింది.ఇక మొదటి రెండు లక్షల వ్యూస్‌ ను ఆర్ ఆర్‌ ఆర్‌ చిత్రం గ్లిమ్స్ 36 నిమిషాల్లో రాబట్టగా భీమ్లా నాయక్‌ మాత్రం 39 నిమిషాల్లో అప్పుడు రాబట్టింది.

ఆ తర్వాత మూడు లక్షల వ్యూస్‌ కు ఆర్ ఆర్‌ ఆర్ కు 83 నిమిషాలు పట్టింది.నాలుగు లక్షల వ్యూస్ కు గాను 200 నిమిషాలు పట్టాయి.

మొత్తానికి భారీ పాన్ ఇండియా మూవీ అయినా కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ వ్యూస్ పరంగా భీమ్లా నాయక్‌ రికార్డును బ్రేక్ చేయలేక పోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube