సోషల్ మీడియాలో యూజర్స్ కి బాగా కనెక్ట్ అయిన ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్ టాక్.ఇందులో ఎంతో మంది యువత, పెద్ద వీడియోలు తీసి టిక్ టాక్ స్టార్ లుగా మారారు.
అంతేకాకుండా కొందరు సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకున్నారు.మొత్తానికి ఈ టిక్ టాక్ వీడియోల వల్ల అందరూ ఫాలోవర్స్ ను సంపాదించుకొని స్టార్ లుగా మారారు.
ఇదిలా ఉంటే ఈ టిక్ టాక్ వీడియోల నుండే మరో స్టార్ గా మారిన సోనిక గురించి సోషల్ మీడియా ప్రేక్షకులకు బాగా పరిచయం.
టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడింది సోనిక.
వైజాగ్ కు చెందిన సోనిక బీటెక్ చదివింది.ఇక ఈమె టిక్ టాక్, యూట్యూబ్ లలో వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.డాన్స్ వీడియోలతో మంచి పేరు సంపాదించుకుంది.తక్కువ సమయంలో టిక్ టాక్ స్టార్ గా మారిన సోనిక అతి తక్కువ సమయంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.
టిక్ టాక్ వీడియోల కోసం అందులో లైకుల కోసం టిక్ టాక్ యూజర్లు ఎంత దూరమైనా వెళ్లి వీడియోలు చేస్తారు.ప్రమాదకరమైన చోట్లలో కూడా వీడియోలు చేస్తూ బాగా లైకులు సంపాదించుకుంటారు.
నిజానికి ఇటువంటి వీడియోలు చూడటానికి బాగానే ఉంటాయి.కానీ ఆ వీడియోలను చేసే వాళ్ళు మాత్రం అక్కడున్న ప్రమాదకరమైన పరిస్థితిని కూడా చూసుకోకుండా వీడియోలు చేస్తుంటారు.
ఇప్పటికే ఎంతోమంది సముద్రపు ఒడ్డున, కాలువల మధ్యన, ఎత్తయిన కొండల పైన, రోడ్లపైన ఇలా ప్రమాదకరమైన స్థలాల్లో వీడియోలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకున్నారు.కొందరు ప్రాణాలు కోల్పోయారు.
అందులో సోనిక కూడా రోడ్లపై వీడియోలు చేస్తూ తన ప్రాణాలే కోల్పోయింది.తనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.
ఇక తను తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్ రైడింగ్ చేస్తూ వీడియో చేస్తుండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది.
గతంలో నల్గొండ జిల్లాలో కేతపల్లి మండలం కొర్రపాటి టోల్ గేట్ సమీపంలో ఉన్న రోడ్డుపై సోనిక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి టిక్ టాక్ వీడియో చేస్తుండగా సైకిల్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిసింది.
ఇక ఆ ప్రమాదంలో తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ కు కూడా గాయాలయ్యాయి.అయితే ఆ ప్రమాదంలో ముందుగా సోనికకు చిన్న గాయాలే జరిగాయని తెలిసింది.
ఇక తన బాయ్ ఫ్రెండ్ కు మాత్రం బాగా గాయాలు తగలడంతో అతడు సీరియస్ గా అయ్యాడు.ఇక తనతో పాటు తన ఫ్రెండ్స్ అందరూ అతడి కోసం ఫండ్స్ కలెక్ట్ చేసి అతడిని కాపాడారు.కానీ సోనిక మాత్రం తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు.తనకు తగిలిన చిన్న గాయాలు నయం అయ్యాయని అందరూ అనుకున్నారు.
కానీ ఆ గాయాల వల్ల తన ఆరోగ్య మొత్తం క్షీణించిపోయింది.చివరికి ప్రాణాలే కోల్పోయింది.
దీంతో అందరూ షాక్ అయ్యారు.కొందరు ఆమెదే తప్పని రోడ్డుపై అలా వీడియోలు చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు పెట్టారు.
మరికొందరు ఆమె తన బాయ్ ఫ్రెండ్ కోసం ఫండ్స్ సేకరించింది కానీ తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తనకు ఎవరు ఫండ్స్ సేకరించలేదు అంటూ కామెంట్లు చేశారు.మరికొందరు అసలు విషయం తెలుసుకోకుండా అలా కామెంట్లు చేయొద్దని కోరారు.
కానీ ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఆమె ఫాలోవర్స్ మాత్రం చాలా బాధ పడ్డారు.కానీ చివరికి సోనిక బాయ్ ఫ్రెండ్ రఫీ కూడా కొన్ని కారణాలతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు.