ప్రపంచం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతోంది.టెక్నాలజీతో నూతన పుంతలు తొక్కుతోంది.
యువత టెక్నాలజీ వైపు దూసుకుపోతోంది.రాను రాను రోబోల వాడకం కూడా పెరుగుతోంది.
వ్యవసాయంలో ఆధునిక పరికరాలు రావడం వల్ల వ్యవసాయం అతి సులభంగా మారింది.శ్రమ పడకుండానే యంత్రాల సాయంతో అన్ని పనులు పూర్తి చేసేస్తున్నారు.
నూతన పరికరాల వినియోగం ఎక్కువయ్యింది.పరిశోధనల పట్ల యువతీ యువకులకు మక్కువ పెరుగుతోంది.
పెట్రోల్, డీజిల్ కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది.ఆటో మొబైల్ సంస్థలు అద్భుతమైన మోడళ్లలో వాహనాల్ని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో అందరికీ ఆ వాహనాలు చేరువవుతున్నాయి.
ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థ పిల్లలు ఆడుకునే బొమ్మల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు సిద్దమైంది.పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలకు అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్స్‌ని యాడ్ చేసి అబ్బుర పరచనుంది.
టెక్నాలజీ సాయంతో రోబో ఎలక్ట్రిక్ గుర్రాల్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లను చేస్తోంది.ఇటువంటి గుర్రాల్ని పిల్లలు అవసరం అనుకున్నప్పుడు ఆడుకోవడమే కాకుండా వీధుల్లో తిరగడానికి కూడా వాడుకోవచ్చు.
ఆ గుర్రాలపై ఎక్కి తిరగొచ్చు.ఇటువంటి పరికరాలు రావడం వల్ల పిల్లలకు ఎంతో ఆనందం కలగడమే కాకుండా ఇలాంటి వాటిని తయారు చేయాలని ఉత్సాహం కూడా పెరిగే అవకాశం ఉంది.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన జిపెంగ్, యూనికార్న్ సంస్థ ఎలక్ట్రిక్ గుర్రాన్ని తయారు చేసింది.పురాణాల్లో మనకు వినిపించే ఒంటికొమ్ము గుర్రం అయిన యూనికార్న్ స్ఫూర్తితో ఆ సంస్థ ఒంటికొమ్మును డిజైన్ చేసి ఆశ్చర్యపరిచింది.
అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీకి తోడుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ రోబో యూనికార్న్ పిల్లలు ఇంట్లో ఆడుకోవడానికే కాకుండా వీధుల్లో దానిపైకి ఎక్కి సవారీ చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని తయారీదారులు తెలియజేస్తున్నారు.