తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మధురమైన పాటలను శ్రోతలకు అందించిన వారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో భాషలలో ఎన్నో వేల పాటలు పాడి ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయారు.
అది క్లాసికల్ పాటైన, మాస్ పాటైనా, విషాదం కలిగించే పాట అయినా ఇట్టే పాడి ప్రేక్షకుల మదిని దోచుకున్న గాయనీ గాయకులుగా వీరిని చెప్పవచ్చు.ఇక ఎన్నో అద్భుతమైన మధురమైన పాటలు పాడిన జానకి గారికి శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నాయంటే ఎవరూ కూడా నమ్మరు.
తరచుగా ఆయాసంతో బాధపడుతున్న జానకి ఎన్నో సందర్భాలలో శ్వాసను బిగపట్టుకొని పాటలు పాడారు.
ఈ క్రమంలోనే శంకరాభరణం సినిమాలోని సామజ వర గమన అనే పాట పాడుతున్న సమయంలో జానకి గారికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని తను అలా బాధ పడుతున్న సమయంలో బాలసుబ్రమణ్యం గారు ఏదో ఒక టాబ్లెట్ వేసుకోమని ఇచ్చారు.
సాధారణంగా కొన్ని టాబ్లెట్స్ జానకి గారికి పడవు వాటిని వేసుకోవడం వల్ల అలర్జీ వస్తుంది అని చెప్పినప్పటికీ బాలు గారు బలవంతం చేయడంతో ఆ టాబ్లెట్ వేసుకున్నారు.అయితే ఆ టాబ్లెట్ వేసుకున్న కొన్ని నిమిషాలకే జానకి గారిలో ఎన్నో మార్పులు జరిగాయి.
ఆమెను చూసిన బాలసుబ్రమణ్యం గారు భయపడిపోయారు.
టాబ్లెట్ వేసుకున్న 5 నిమిషాలకే గుండె బిగపట్టినట్టు అవ్వడం శ్వాస ఆడకపోవడం కళ్ళు ఉబ్బడం వంటివి జరగడం చూసి బాలసుబ్రమణ్యం భయపడిపోయారు అయితే ఆ వెంటనే ఇంజక్షన్ వేసుకోవడం వల్ల 20 నిమిషాలకి శ్వాస ఆడటం జరిగిన కళ్ళు వాపు మాత్రం నాలుగైదు రోజులు అలాగే ఉండిపోయాయి.ఇలా జానకి గారు బ్రీతింగ్ సమస్య కారణంగా ఆ సమస్యను ఎదుర్కొంటూ ఎన్నో పాటలు పాడానని, శంకరాభరణం సినిమాలోపాట పాడుతున్న సమయంలో బాలు చేసిన పనికి నిజంగానే ప్రాణం పోయినంతపనైందని ఓ సందర్భంలో తెలియజేశారు.
ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి 2013వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించింది.అందుకు గల కారణం దక్షిణ భారత కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించిన ఆమె తనకు వచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా తిరస్కరించింది.