వెండితెర సినిమాల్లో హీరోగా, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే అవసరాల శ్రీనివాస్ పెళ్లి మాత్రం చేసుకోలేదు.అవసరాల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పెళ్లి వద్దనుకోవడం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఫిల్మ్ మేకర్స్ మారాల్సిన సమయం వచ్చిందని మారుతున్నారని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.
తాను డైరెక్టర్ గా కమిటై ఆగిపోయిన సినిమాలు ఆగిపోలేదని డైరెక్టర్ గా మూడవ సినిమా సగంలో ఉందని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
నేను చేయనని ఎవరికీ చెప్పనని అవసరాల అన్నారు.నేను కాకినాడ దగ్గర ఉన్న మండపేటలో పుట్టానని హైదరాబాద్ లో చదివానని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.తాను ఇంజనీరింగ్ చదివానని కిషోర్ కుమార్ పాటలు బాగా వింటానని మ్యూజిక్ నేర్చుకోవాలని తనకు ఉండేదని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.
చనువు కొద్దీ ఏమైనా అంటే హర్ట్ కానని ఎక్కువగా దాని గురించి ఆలోచించనని అవసరాల వెల్లడించారు.
అవతలి వ్యక్తి అన్నది ఒప్పుకోకపోతే విరోధం ఉందని కాదని అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు.పెళ్లి చేసుకోకూడదని తాను నిర్ణయం తీసుకున్నానని ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి కన్వీన్స్ చేశానని అవసరాల తెలిపారు.
మా నాన్నగారు నేను తీసుకున్న నిర్ణయం విషయంలో జలస్ గా ఫీల్ అవుతారని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమీ లేదని అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు.మహానటి సినిమాకు కీర్తి సురేష్ సూట్ కాదని అనుకున్నానని కానీ తర్వాత ఆ పాత్రకు సూటయ్యారని అనిపించిందని అవసరాల చెప్పుకొచ్చారు.దర్శకుడిగా అవసరాల ఇప్పటికే రెండు విజయాలను అందుకోగా మూడో సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది.