ఖుషీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ స్ట్రెయిట్ సినిమాల్లో నటించినా, రీమేక్ సినిమాల్లో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ నే ఎక్కువగా అందుకున్నాయి.ఖుషీ విడుదలైన ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో జల్సా సినిమా తెరకెక్కి హిట్ రిజల్ట్ ను అందుకున్నా పవన్ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఆ సినిమా సక్సెస్ సాధించలేదు.
అయితే గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు.
పవన్ ను అమితంగా అభిమానించే అభిమానులలో ఒకరైన హరీష్ శంకర్ ఆ సినిమాలో పవన్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని అనుకున్నారో అదే విధంగా చూపించారు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూపించారు.అయితే గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కావడానికి చాలా సంవత్సరాల సమయం పట్టింది.పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా హరీష్ పవన్ తో తెరకెక్కించే సినిమా గురించి మాట్లాడుతూ పవన్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని భావిస్తున్నారో అదే విధంగా చూపించబోతున్నానని వెల్లడించారు.
సంకల్ప బలం అన్నిటితో పోలిస్తే గొప్పదని గబ్బర్ సింగ్ మూవీపై ఏ స్థాయిలో ఆశలు, అంచనాలు ఉన్నాయో పవన్ తో తెరకెక్కించే మరో సినిమాపై కూడా ఆశలు, అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయని హరీష్ చెప్పుకొచ్చారు.
పవన్ తో తెరకెక్కించే సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చిందని అభిమానులు ఈ సినిమపై భారీగా అంచనాలను ఏర్పరచుకున్నా ఆ అంచనాలను మించి సినిమా ఉంటుందని హరీష్ కామెంట్లు చేశారు.ఫ్యాన్స్ థియేటర్ల నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వచ్చే విధంగా పవన్ తో తెరకెక్కించే మూవీ ఉండబోతుందని హరీష్ శంకర్ కామెంట్లు చేశారు.