బాలీవుడ్ 'షేర్షా' టీమ్ ను ప్రశంసించిన బన్నీ!

బాలీవుడ్ లో ఎక్కువుగా వినపడే మాట నెపోటిజంకానీ టాలీవుడ్ లో అలా కాదు ఏ హీరో అయినా నటన బాగా చేస్తే వారిని ఎంకరేజ్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు.మన టాలీవుడ్ హీరోలు కంటెంట్ బాగుంటే ఆ సినిమాలను ఎప్పుడు మెచ్చుకుంటూనే ఉంటారు.

 Allu Arjun Reviews Shershaah Movie, Shershaah, Allu Arjun, Bollywood, Pushpa, Su-TeluguStop.com

ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా ఉంటాడు.మంచి సినిమాలను ఎప్పుడు మెచ్చుకుంటూ వారిని ఇంకా ముందుకు నడిచేలా ప్రశంసిస్తూ ఉంటాడు.

తాజాగా అల్లు అర్జున్ బాలీవుడ్ షేర్షా సినిమా గురించి మాట్లాడారు.ఈ సినిమాను తాజాగా అల్లు అర్జున్ చూసాడు.ఈ సినిమాను వీక్షించిన అల్లు అర్జున్ ఈ సినిమా టీమ్ కు ప్రశంసలు అందించాడు.ఈ సినిమా ప్రతి భారతీయుడు చూడాల్సిన షేర్షా అంటూ అల్లు అర్జున్ తెలిపాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించాడు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో ఉంది.

Telugu Allu Arjun, Alluarjun, Bollywood, Pushpa, Shershaah, Sukumar-Movie

సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ చేస్తూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు బన్నీ.ఈ చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు.హృదయానికి హత్తుకునేలా ఈ సినిమా ఉంది సిద్దార్థ్ మల్హోత్రా కెరీర్ లో ఉత్తమ ప్రదర్శ కియారతో పాటు ఇతర నటుల ప్రదర్శన కూడా బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాను డైరెక్టర్ విష్ణు వర్ధన్ అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.

Telugu Allu Arjun, Alluarjun, Bollywood, Pushpa, Shershaah, Sukumar-Movie

ఇది ఇలా ఉంటే ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కాబోతుంది.మొదటి పార్ట్ ను పుష్ప ది రైజ్ పేరుతొ విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube