1.జీవోలన్నీ వెబ్ సైట్ లో పెట్టాలి : హై కోర్ట్
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని 24 గంటల్లోగా జీవో లు అన్నిటిని ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
2.గాంధీ ఆసుపత్రి ముట్టడి కి వైఎస్సార్ టీపీ ప్రయత్నం
గాంధీ ఆస్పత్రి ముట్టడికి వైఎస్సార్ టిపి నేతలు ప్రయత్నించారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
3.ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం దేగవత్ తండాలో కున్సోత్ గంగాధర్ అనే వ్యక్తి పై ఎలుగుబంటి దాడి చేసింది.గంగాధరరావు మందు తీసుకొని మేత కోసం అడవిలోకి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది.
4.ఈ సెట్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ సెట్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను నేడు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు.
5.సుప్రీం కోర్ట్ జడ్జ్ గా ముగ్గురు మహిళలు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ సుప్రీంకోర్టుకు బదిలీ కానున్నారు.సుప్రీం జడ్జిగా మొత్తం తొమ్మిది మంది పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ బేల త్రివేది ఉన్నారు.
6.బాల్యవివాహాన్ని అడ్డుకున్న చైల్డ్ లైన్
తెలంగాణలోని రాజేందర్ నగర్ పరిధి అత్తాపూర్ లో భారీ వాహనాన్ని చైల్డ్ లైన్ సంస్థ అధికారులు అడ్డుకున్నారు.16 సంవత్సరాల బాలికకు కుటుంబసభ్యులు బలవంతంగా వివాహం చేస్తున్నట్టు వచ్చిన సమాచారం తో చైల్డ్ లైన్ అధికారులు షీ టీమ్ తో కలిసి వివాహాన్ని అడ్డుకున్నారు.
7.ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న తెలంగాణ వాసి
కరీంనగర్ జిల్లా ఓద్యారం కు చెందిన పెంచాల వెంకటయ్య ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్నారు.ఆఫ్గనిస్తాన్ లోని కసబ్ ప్రాంతంలో ఏసీసీఎల్ కంపెనీ లో ఆయన ఉద్యోగం చేస్తున్నారు.
8.కెసిఆర్ కు టిఎన్జీవోల క్షీరాభిషేకం
దళిత ఉద్యోగులు కూడా దళిత బంధు పథకం వర్తింపచేస్తాము అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించటం హర్షనీయమని టిఎన్జీవోల కేంద్ర సంఘం అభిప్రాయపడింది.ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసింది.
9.వైసిపి నాయకుల పై టీడీపీ ఫిర్యాదు
వైసీపీ నేతల పై తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమపై దురుసుగా ప్రవర్తించారని ఎస్పీ విశాల్ గున్నీ కి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫిర్యాదు చేశారు.
10.పామాయిల్ కార్మికుల ధర్నా
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలక్టరేట్ వద్ద పామాయిల్ కార్మికులు ధర్నాకు దిగారు.
11.జగన్ పై జనసేన కామెంట్స్
ప్రభుత్వం చేసే నిర్ణయాలపై దాపరికం ఎందుకు అంటూ జనసేన నాయకుడు పోతిన వెంకట మహేష్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
12.జగన్ పై రఘురామ కామెంట్స్
పట్టపగలు విద్యార్థిని రమ్యశ్రీ ఒక ఉన్మాది అందరూ చూస్తుండగానే చంపేశాడు అని, సిగ్గుపడాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ , సీఎం జగన్ పై విమర్శలు చేశారు.
13.మీడియా బాధ్యతగా ఉండాలి : సేజేఐ
నూతన న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు వీడియోస్ కథనాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అధికారిక ప్రకటనకు ముందే నియామకాల గురించి కథనాలు రావడం వల్ల అవాంఛనీయ ఫలితాలు వస్తాయన్నారు.
14.ఎన్ డి ఏ పరీక్షకు మహిళలకు సుప్రీంకోర్టు అనుమతి
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది.
15.ఎంపీ పై దేశ ద్రోహం కేసు
తాలిబన్ల ను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోలినట్లు చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రహ్మాన్ బార్క్ , మరో ఇద్దరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.
16.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 35,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.25న మైసూర్ మేయర్ ఎన్నికలు
కర్ణాటకలోని మైసూర్ మహానగర్ పాలికె మేయర్ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి.
18.సీబీఐ అధికార్లను కలిసిన వివేకా కుమార్తె
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 73 వ రోజు కొనసాగుతోంది.ఈ రోజు సీబీఐ అధికార్లను వివేకా కుమార్తె సునీత కలవడం ఆసక్తికరంగా మారింది.
19.అగ్రిగోల్డ్ బాధితుల నమోదు గడువు పొడిగింపు
అగ్రిగోల్డ్ సంస్థ 20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్ దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువు ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,500 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,500