వారి కోసం ఆ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనుసూద్

కలియుగ దాన వీర శూర కర్ణ సోనుసూద్ గురించి తెలియని భారతీయులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.కొవిడ్ కష్టకాలంలో ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరిని దాదాపుగా తన శక్తి మేరకు ఆదుకున్న సోనుసూద్‌కు తెలంగాణలోని ఓ ప్రాంతంలో ప్రజలు గుడి కూడా కట్టారు.

 Sonu Sood, Who Entered The Business For Them , Charity, Sonu Sood, Dilip Kumar M-TeluguStop.com

ప్రొఫెషనల్ సినిమా పర్సన్‌గా మాత్రమే కాకుండా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా సోను తనకంటూ సొసైటీలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.తాజాగా సోను ట్రావెల్ బిజినెస్ ప్రారంభించారు.

ట్రావెల్ యూనియన్ నెట్‌వర్క్’ పేరిట ప్రారంభమైన ఈ బిజినెస్‌ వ్యాపారం, పర్యాటక రంగంలో పనిచేసే ట్రావెల్ ఏజెంట్స్, చిన్న వ్యాపారవేత్తలకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.ఈ నెట్‌వర్క్‌ సాయంతో గ్రామీణ ప్రాంతాల వారికి సాయం కూడా చేయనున్నారు సోను.

దిలీప్ కుమార్ మోడీ కంపెనీ, స్పైస్ మనీ భాగస్వామ్యంతో ఈ ప్లాట్‌ఫాంను సోను ప్రారంభించారు.ఈ ట్రావెల్ యూనియన్ నెట్‌వర్క్‌కు సోనుసూద్ డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్నారు.కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో తాను గ్రామీణ భారతాన్ని చాలా దగ్గర నుంచి చూశానని సోను పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈ కంపెనీ స్టార్ట్ చేసినట్లు తద్వార గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు మేలు జరిగేలా చూస్తామని చెప్పారు.

గ్రామీణ ప్రయాణ రంగం ఇప్పటికీ అసంఘటితంగానే ఉందని, తమ కంపెనీ ట్రావెల్ ఏజెంట్స్ ఇందులో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారని వివరించారు.ట్రావెల్ యూనియన్ సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని సోను ప్రకటించారు.

ట్రావెల్ యూనియన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.ఇప్పటికి ఇంగ్లిష్, హిందీ భాషల్లో యాప్ అవెయిలబుల్‌లో ఉండగా, త్వరలో పదకొండు భాషల్లో రానుంది.

సోనుసూద్ సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు కృషి చేస్తుండటం హర్షణీయమని పలువరు పేర్కొంటున్నారు.సోను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ ఫిల్మ్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube