తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలలోనూ హుజురాబాద్ ఫీవర్ రోజురోజుకు పెరిగిపోతోంది.ఎలాగైనా ఇక్కడ పైచేయి సాధించాలని అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వ్యూహాలను రూపొందించుకునే పనిలో ఉన్నాయి.
ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.రాజేందర్ ఓటమి కోసం టిఆర్ఎస్ అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తుండడంతో, అధికార పార్టీ హోదాలో బిజెపి ఎలాగైనా ఇక్కడ గెలిచి తెలంగాణలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా హుజూరాబాద్ లో రాజకీయ పరిణామాలతో పాటు, టిఆర్ఎస్ ను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై అమిత్ షా తో చర్చించినట్లు తెలుస్తోంది.
అమిత్ షా ను కలిసిన వారిలో వివేక్ వెంకటస్వామి, రవీంద్రారెడ్డి వంటి వారు ఉన్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో ఈటెల రాజేందర్ తో పాటు బండి సంజయ్ వేర్వేరుగా చేపట్టనున్న పాదయాత్ర విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే హుజురాబాద్ లో టిఆర్ఎస్ ఎప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులను మోహరించడం తో పాటు, మండలాల వారీగా ఇన్చార్జిల ను నియమించడంతో బిజెపి అలర్ట్ అవుతోంది.కేంద్ర మంత్రులు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నారని అమిత్ షా ఈ సందర్భంగా ఈటెల బృందానికి చెప్పినట్లు సమాచారం.
అయితే కేంద్రమంత్రులు హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది ? రాకపోతే ఏంటి పరిస్థితి అనే విషయం పైన ఈ సమావేశంలో చర్చించారట.
అమిత్ షాతో భేటీ తరువాత కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్ తదితర మంత్రులను ఈటెల, బండి సంజయ్ లను కలవనున్నారు.ఢిల్లీలో మీరు ఎవరెవరిని కలుస్తున్నారు ఏ అంశాలపై చర్చిస్తున్నారు అనే విషయాలపై టిఆర్ఎస్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.టిఆర్ఎస్ కు పోటీగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగితే హుజురాబాద్ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతుంది.