ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన ఎప్పుడో ? 

ఏపీ తో పోల్చుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.అక్కడ పార్టీ సీనియర్లతో పాటు, అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నాయకులూ ఎక్కువగా ఉండడంతో పూర్తిగా కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా పర్వాలేదు అన్నట్లుగానే ఆ పార్టీని ముందుకు తీసుకు వస్తున్నారు .

 There Is A Growing Demand For The Ap Congress To Appoint A New President, Ap Con-TeluguStop.com

ఈ క్రమంలోనే పూర్తిగా కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసే దిశగ అధిష్టానం రంగంలోకి దిగి, చురుకైన యువ నేత రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.త్వరలోనే రేవంత్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుల నియామకం చేపట్టి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులు తీసుకురావాలని ప్లాన్ లో ఆ పార్టీ అధిష్టానం ఉంది .రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ ను  నిలబెట్టాలని,  2023 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆకాంక్షతో ఉంది.ఇంత వరకూ బాగానే ఉన్నా,  పక్కనే ఉన్న ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది.

ఆంధ్ర తెలంగాణ విభజన దగ్గర నుంచి కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయింది .

ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు దక్కని పరిస్థితి.కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం,  బలమైన నాయకులు ఎవరూ లేకపోవడం,  ఉన్న నాయకుల్లోనూ నిరుత్సాహం అలుముకుంది.దీంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంతంతమత్రంగానే ఉన్నాయి.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఉన్నప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.ఏపీ ప్రభుత్వం పై విమర్శలు పోరాటాలు ఇలా ఏది చేయాలన్నా,  బిజెపి, టిడిపి జనసేన పార్టీ లు మాత్రమే చేస్తున్నాయి.

దీంతో ఏపీ కాంగ్రెస్ లోనూ సమూల మార్పులు తీసుకురావాలని పార్టీ అధ్యక్షుడిగా మరో నేతను నియమించాలనే డిమాండ్ పెరుగుతోంది.ప్రస్తుతం కాంగ్రెస్ నిలదొక్కుకునేందుకు ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అనేక సమస్యలు ఉన్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ధరల పెరుగుదల, పోలవరం ప్రాజెక్టు మూడు రాజధానులు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సమస్యలు ఏపీలో నెలకొన్నాయి.

Telugu Aicc, Ap Congress, Ap, Ap Telangaba, Rahul Gandhi, Revanth Reddy, Sonia-T

వీటిపైన కాంగ్రెస్ పోరాడితే గతంతో పోలిస్తే కాస్త పరిస్థితి ఆశాజనకంగా ఉండే చాన్స్ ఉంది కానీ వీటిని కాంగ్రెస్ నేతలెవరూ సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు.అందుకే వీలైనంత తొందరగా ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు నియమించి పార్టీ లో సమూల మార్పులు తీసుకువచ్చి ఉత్సాహం నింపక పోతే పూర్తిగా కాంగ్రెస్ ఏపీలో కనుమరుగవుతుందని హెచ్చరికలు పార్టీ సీనియర్ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube