కరోనా భయం.. నేను చచ్చిపోతా, నా బిడ్డ పరిస్ధితేంటీ: కూతురిని పొడిచి పొడిచి చంపిన ఎన్ఆర్ఐ మహిళ

కరోనా విజృంభిస్తున్న వేళలో ప్రజలకు అన్నిటికన్నా కావల్సింది మానసికబలం అని నిపుణులు పదే పదే చెబుతున్నారు.కరోనాతో వచ్చే శారీరక బాధల వలన వచ్చే ముప్పుకన్నా.

 Indian Woman Stabs 5 Year Old Daughter At Uk Home Over Covid Worry, Corona, Brit-TeluguStop.com

మానసికంగా వచ్చే ఇబ్బందితోనే ముప్పు చాలా ఎక్కువ అని వారంటున్నారు.కోవిడ్ సోకకపోయినా అది సోకుతుందేమోనన్న భయంతో మితీమిరిన శుభ్రత, ఎవ్వరినీ ఇంటికి రానీయకపోవడం, వేరొకరికి ఇంటికి తాను వెళ్లకపోవడం, అనుమానపు చూపులు, ఒంట్లో ఏదైనా తేడాగా వుంటే కరోనా సోకిందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.

మీడియాలో భయాందోళనలు కల్పించే కథనాలు, డిబేట్లు, కరోనాకు సంబంధించిన వార్తలు అదే పనిగా చూడటం వంటి కారణాల వల్ల పలువురు ఉన్మాదులుగా మారుతున్నారు.తాజాగా బ్రిటన్‌లో ఓ భారత సంతతి మహిళ.

కరోనా భయంతో కన్నకూతురిని దారుణంగా హత్య చేసింది.

వివరాల్లోకి వెళితే.

భారత్‌కు చెందిన సుధా శివనాదం అనే మహిళకు 2006లో వివాహం జరిగింది.పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో సహా బ్రిటన్‌లో స్థిరపడ్డారు.

ఈ దంపతులకు ఓ పాప.ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో కరోనా చిచ్చుపెట్టింది.గతేడాది వెలుగుచూసిన కరోనాను కంట్రోల్ చేయడానికి అన్ని దేశాలు లాక్‌డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రోజుల తరబడి నాలుగు గోడల మధ్యనే ఉండటం, వైరస్ గురించి అదే పనిగా వార్తలు చూడటంతో సుధా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

దీనికి తోడు కొత్త వేరియెంట్లు పుట్టుకోస్తుండటం, కళ్లెదుటే లక్షలాది మంది ప్రాణాలు పోతుండటంతో వైరస్ గురించి అతిగా ఆలోచిస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు.దీంతో సుధ మానసికంగా కృంగిపోయారు.

కరోనా వల్ల ఎట్టిపరిస్ధితుల్లోనూ తాను చనిపోవడం ఖాయమని ఆమె మనసులో ఫిక్సయ్యారు.

Telugu Britain, Corona, Sudha Sivanadam, Indian-Telugu NRI

ఈ క్రమంలోనే తాను ప్రాణాలతో లేకపోతే.తన ఐదేళ్ల కూతురు దిక్కులేనిది అయిపోతుందని తీవ్ర మనో వేదనకు గురయ్యారు.దీంతో ఆమెను తన కంటే ముందే చంపేస్తే ఎలాంటి ఇబ్బంది వుండదని భావించింది.

దీనిలో భాగంగా గతేడాది జూన్ 30న సరుకుల కోసం భర్త బయటికి వెళ్లిన తర్వాత సుధా శివనాదం ఉన్మాదిలా మారిపోయారు.తన బిడ్డను కత్తితో దాదాపు 15 సార్లు పొడిచి చంపేశారు.

అనంతరం ఆమె కూడా కత్తితో తనను తాను గాయపరచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.విషయం తెలుసుకున్న సుధ భర్త.

ఇంటికి చేరుకునే సమయానికి చిన్నారి రక్తపుమడుగులో నిర్జీవంగా పడివుంది.ఆ పక్కనే భార్య కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సుధా శివనాధంను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.కోర్ట్ ఆమెను మెంటల్ హెల్త్ యాక్ట్ సెక్షన్ 37, 41 ప్రకారం మానసిక రోగుల వైద్య శాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube